రింగుతో ప్రపంచ రికార్డు!

చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే... దాంట్లోనే అరుదైన ప్రత్యేకత సాధించాలనుకుంది... అందుకోసం శ్రమించింది... సాధించింది... ఇదంతా దేని గురించో చూడండి...హులాహూప్‌ తెలుసుగా! రింగులా గుండ్రంగా ఉంటుంది. దాన్ని నడుము చుట్టూ తిప్పుతారు. సాధారణంగా దాని పొడవు 75 సెం.మీ. కానీ గెట్టీ కెహయోవా 17 అడుగుల పైగా పొడవున్న దానితో ఈ...

Published : 09 Feb 2022 01:09 IST

చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే... దాంట్లోనే అరుదైన ప్రత్యేకత సాధించాలనుకుంది... అందుకోసం శ్రమించింది... సాధించింది... ఇదంతా దేని గురించో చూడండి...

హులాహూప్‌ తెలుసుగా! రింగులా గుండ్రంగా ఉంటుంది. దాన్ని నడుము చుట్టూ తిప్పుతారు. సాధారణంగా దాని పొడవు 75 సెం.మీ. కానీ గెట్టీ కెహయోవా 17 అడుగుల పైగా పొడవున్న దానితో ఈ విన్యాసం చేసి గిన్నిస్‌ రికార్డూ దక్కించుకుంది. అమెరికాలోనో లాస్‌వెగాస్‌కి చెందిన ఈమె సర్కస్‌లో పనిచేసేది. హులాహూప్‌ శిక్షకురాలు కూడా. ‘మా అక్క దీన్ని పరిచయం చేసింది. అప్పటి నుంచీ అంటే 30 ఏళ్లుగా సాధన చేస్తున్నా ఏదో వెలితి. కొత్తగా చేయాలనుకుని అతిపెద్ద హూప్‌తో ప్రయత్నించా. మొదట్లో దెబ్బలు తగిలేవి. కొరడాతో కొట్టినట్లుండేది. ఏడాది సాధన చేశాక పట్టు సాధించా. ఎందుకింత కష్టమంటే.. నన్ను చూసి కొందరైనా స్ఫూర్తి పొందాలనే’ అనే గెట్టీది రికార్డుల కుటుంబం. ఈమె నాన్న, అక్క కూడా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కినవారే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్