కాలానికి తగ్గట్టు.. వార్డ్‌రోబ్‌ సిద్ధమేనా?

వర్షాకాలం... ముసురు ప్రభావం మనతోపాటు వార్డ్‌రోబ్‌కీ తప్పదు. ఈ చెమ్మ అపరూపంగా చూసుకునే బట్టలు, బ్యాగులను నాశనం చేయకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

Published : 19 Jul 2021 01:36 IST

వర్షాకాలం... ముసురు ప్రభావం మనతోపాటు వార్డ్‌రోబ్‌కీ తప్పదు. ఈ చెమ్మ అపరూపంగా చూసుకునే బట్టలు, బ్యాగులను నాశనం చేయకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

వేడుకలేవైనా భారీ జరీ, పట్టు చీరలకు ప్రాధాన్యమిస్తుంటాం. ఫంక్షన్లప్పుడు బయటకు తీసి తర్వాత వాటి సంగతే మర్చిపోతుంటాం. ఈ కాలంలో కట్టుకుంటే వాటిని పూర్తిగా ఆరేంతవరకూ వేలాడదీసి, ఐరన్‌ చేశాకే భద్రపరచండి. తేమ చేరకుండా మస్లిన్‌ లేదా కాటన్‌ క్లాత్‌లో చుట్టి పెట్టండి. నాఫ్తలీన్‌ గోళీలు కరిగి వాటి రంగు దుస్తులకు పట్టొచ్చు. బదులుగా సిలికా జెల్‌ సాచెట్‌లను ఉంచండి. లేదంటే కాటన్‌ వస్త్రంలో చుట్టి పెట్టొచ్చు. ఇవి ముక్క వాసనను దూరం చేస్తాయి, తేమనూ పీల్చుకుంటాయి.

* తేమ వల్ల గిల్టు నగల రంగు వెలిసిపోవడమే కాకుండా ఫంగస్‌ కూడా పెరుగుతుంది. బ్యాగుల రింగులూ తుప్పూ పడుతుంటాయి. కాబట్టి నగలు, బ్యాగులను అట్టపెట్టెలు లేదా క్లాత్‌ బ్యాగుల్లో ఉంచండి. బ్యాగుల్లో పేపర్లను ఉంచండి.

* వార్డ్‌రోబ్‌ల్లో చాక్‌పీస్‌లు, వేపాకులు ఉంచినా తేమను దరిచేరనివ్వవు. ర్యాకుల్లో పేపర్లను రెండు పొరలుగా వేసి, అప్పుడు బట్టలు పెట్టుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్