ఎండుఫలాల నిల్వ ఇలా!

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ గుప్పెడు ఎండుఫలాలు తినాలంటారు. ఎందుకంటే ఇవి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి మరి. మరి వీటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దామా!

Published : 25 Aug 2021 01:09 IST

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ గుప్పెడు ఎండుఫలాలు తినాలంటారు. ఎందుకంటే ఇవి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి మరి. మరి వీటిని ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దామా!
గాలి చొరబడని డబ్బాల్లో... ఎండు ఫలాలను శుభ్రంగా, పొడిగా గాలి చొరబడని డబ్బాల్లో వేసి భద్రపరచాలి. లేదంటే అవి తేమగా మారి ముక్క వాసన వస్తాయి. ఇలా చేస్తే నట్స్‌ ఎక్కువకాలం పాటు పొడిగా, తాజాగా ఉంటాయి.
చల్లటి ప్రదేశంలో... వీటిని ఉష్ణోగ్రత అధికంగా, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నిల్వ చేయకూడదు. ఇలా చేస్తే త్వరగా పాడవుతాయి. వేడిగా ఉండే వంట గదిలోనూపెట్టొద్దు. చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో భద్రపరచాలి. సాధారణ అరల్లో నిల్వ చేయొచ్చు. రిఫ్రిజిరేటర్లలో ఉంచడమూ మంచిది కాదు.
వేయించి... డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువకాలం నిల్వ చేయాలంటే వాటిని కాసేపు కడాయిలో వేయించి చల్లారాక భద్రపరిస్తే పాడవ్వవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్