శుభ్రతకీ ప్రణాళిక

వంటిల్లు, హాలు, పడగ్గది... ప్రతి గదినీ రోజూ చీపురుతో ఊడుస్తాం. మాప్‌తో తుడుస్తాం. ఇవి మాత్రమే కాదు... ఇంట్లో ప్రతి వస్తువుని శుభ్రం చేయడానికీ ఓ పద్ధతిని పెట్టుకోవాలి.

Published : 19 Oct 2021 01:57 IST

వంటిల్లు, హాలు, పడగ్గది... ప్రతి గదినీ రోజూ చీపురుతో ఊడుస్తాం. మాప్‌తో తుడుస్తాం. ఇవి మాత్రమే కాదు... ఇంట్లో ప్రతి వస్తువుని శుభ్రం చేయడానికీ ఓ పద్ధతిని పెట్టుకోవాలి.

సింకులు... వీటిని గోరువెచ్చని నీటిలో బ్లీచ్‌ వేసి రోజూ శుభ్రం చేయాలి.

* కడిగిన గిన్నెలను వేసే ‘డిష్‌ డ్రైయింగ్‌ రాక్‌’ను వేడి నీళ్లలో సబ్బు వేసి శుభ్రం చేయాలి

* టోస్టర్‌, అవెన్‌లను వేడినీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి.

* పుస్తకాల ర్యాక్‌ దుమ్మును ఏడెనిమిది రోజులకోసారైనా దులపాల్సిందే.

హ్యాండ్‌ బ్యాగ్‌.... దీన్ని శుభ్రమైన క్లాత్‌తో తుడిస్తే సరి. లేదా ఫ్యాబ్రిక్‌ బ్రష్‌ ఉపయోగించినా సరిపోతుంది.

* సోఫాలను వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.

* టీవీ రిమోట్‌లను యాంటీ బ్యాక్టీరియల్‌ వైప్స్‌తో తుడవాలి.

* పప్పులు, ఉప్పులు వాడుకునే డబ్బాలను కడగడానికి వేడినీళ్లు, సబ్బు వాడాల్సిందే.

బాత్‌ మ్యాట్‌... వారానికోసారి తప్పని సరిగా శుభ్రం చేయాల్సిందే.

మేకప్‌ కిట్‌... వీటిని కనీసం వారానికోసారైనా శుభ్రం చేయాలి. ఇందుకోసం క్లెన్సర్‌ లేదా షాంపు వాడితే సరి.

గొళ్లాలు... యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలుండే వైప్స్‌తో తుడిస్తే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్