Updated : 29/10/2021 04:51 IST

గాజు వెలిగిపోతోంది!

‘గ్లాస్‌ డెకరేటివ్స్‌’.. ఈమధ్య ఎక్కువ ఆదరణ పొందుతోన్న గృహాలంకరణ వస్తువుల్లో ఒకటి. అంటే.. పెయింటింగ్‌, యాక్సెసరీలు మొదలైన వాటితో సిద్ధం చేసిన గాజు సీసాలు, పాత్రలన్నమాట. దీపావళి కూడా వచ్చేస్తుండటంతో వినియోగదారులను ఆకర్షించడానికి వీటికే లైట్లనూ జోడిస్తున్నారు. దీంతో వెలుగులకే పరిమితమవకుండా అందమైన చిత్రాలతో కనువిందూ అవుతుంది. మీరూ ఇంటి అందాన్ని పెంచేలా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే వీటిని ప్రయత్నించొచ్చు. కొనడమెందుకు.. వీటిని మేమూ చేయగలమంటారా! అయితే సృజనకు పని చెప్పేయండి. జామ్‌, పాల సీసాలు, గాజు గ్లాసులు ఏవైనా.. ఇలా అలంకరణ వస్తువులైపోతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని