Updated : 31/10/2021 05:19 IST

బాల్కనీ.. అందంగా

బాల్కనీలో కొంచెం స్థలం ఉన్నా అందంగా మార్చేసుకోవచ్చంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అదెలాగో చూద్దాం.

* పచ్చదనంతో... ఇప్పుడు చక్కటి ఆర్టిఫిషియల్‌ గ్రాస్‌ దొరుకుతోంది. చూడటానికి సహజంగా అనిపించే దీన్ని బాల్కనీకి సరిపోయేలా తెచ్చుకుంటే చాలు. దీన్ని ఫ్లోర్‌ అంతా పరిచేలా సర్దాలి. గ్రిల్స్‌కు వేలాడేసే తొట్టెల్లో పూలమొక్కలను ఉంచాలి. బాల్కనీకి ఒకవైపు ఖాళీగా వదిలేసి, రెండో వైపు సిట్టింగ్‌కు అనువుగా ఉండే కుర్చీలు, దివాన్‌ లేదా చిన్న చెక్కబెంచీ వేసుకోవాలి. గోడ నుంచి చిన్న హుక్‌ద్వారా హ్యాంగింగ్‌ ప్లాంట్స్‌, వరుసగా చిన్న హ్యాంగింగ్స్‌ సర్దాలి. గోడకు లేతవర్ణం రంగును ఎంచుకుంటే చాలు. బాల్కనీ కొత్తగా కనిపిస్తుంది.

* వెదురు ఫర్నిచర్‌తో... చోటుకు సరిపోయేలా రెండు వెదురు కుర్చీలు, టీపాయ్‌ సర్ది వాటిలో ముదురువర్ణం కవర్లు వేసిన దిండ్లను అమర్చితే చాలు. ఒకవైపు చిన్న భాగాన్ని చెక్కలతో విడదీసి అందులో నాలుగైదు క్రోటన్స్‌ మొక్కలను, గోడకు హ్యాంగింగ్‌ ప్లాంట్స్‌ను సర్దాలి. చెక్కలకు లేత రంగు వేయాలి. బాల్కనీ అంచుల వెంబడి చిన్నచిన్న రంగుల తొట్టెలను, ఓ మూలగా త్రికోణం ఆకారంలో ముదురువర్ణం వేసిన చిన్న తొట్టెల్లో క్రోటన్‌ మొక్కలుండేలా అమర్చితే చాలు. వెదురు ఫర్నిచర్‌కు చుట్టుపక్కల తొట్టెలన్నీ చిన్నవిగానే ఉండేలా జాగ్రత్తపడాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని