తోట పెంపకంలో మెలకువలు

అనిత కొత్తగా మారిన ఇంటికి ముందు, వెనుక చాలా చోటు ఉండటంతో తోట పెంచాలనుకుంది. పూలు, కూరగాయల మొక్కలను వేసింది. అయితే నెలయ్యే సరికే అన్నీ వాడి పోయాయి. మొక్కలు పెంచాలంటే ఆసక్తితోపాటు అవగాహన కూడా అవసరం అంటున్నారు నిపుణులు.

Published : 01 Nov 2021 21:30 IST

అనిత కొత్తగా మారిన ఇంటికి ముందు, వెనుక చాలా చోటు ఉండటంతో తోట పెంచాలనుకుంది. పూలు, కూరగాయల మొక్కలను వేసింది. అయితే నెలయ్యే సరికే అన్నీ వాడి పోయాయి. మొక్కలు పెంచాలంటే ఆసక్తితోపాటు అవగాహన కూడా అవసరం అంటున్నారు నిపుణులు.

ఎంపిక... మొక్కలను పెంచడానికి ముందుగా నేలను ఎంపిక చేసుకోవాలి. లోతైన ప్రాంతం, నీరు ఇంకిపోయే చోట మొక్కలకు అనువు కాదు. ఇటువంటి చోట్ల మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. నీడ లేకుండా, ఎండ బాగా పడే ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. సమీపంలో నీటి సౌకర్యం ఉండేలా చూసుకుంటే చాలు. అలాగే మొదట్లోనే పెద్దదిగా కాకుండా చిన్నచోటులో తోట పెంపకాన్ని ప్రారంభించడం మంచిది.

అవగాహన ... తోటలో పెంచాలనుకుంటున్న కూరగాయలు, పూలమొక్కల గురించి అవగాహన పెంచుకోవాలి. ఏయే సీజన్‌లో ఏ తరహా మొక్క పెరుగుతుందో నర్సరీ లేదా యూట్యూబ్‌లో నిపుణుల వద్ద సలహాలను తీసుకోవాలి. వారిచ్చిన సూచనల మేరకు ఇంటికి అవసరమయ్యే కొన్నిరకాల కాయగూర విత్తనాలను సేకరించి వేయాలి. అలాగే గులాబీ, మందారవంటి మొక్కలను తోటలో నాటాలి. సీజన్‌ లేకుండా పూసే పూలమొక్కల ఎంపిక కొత్తలో తోట పెంపకంపై ఆసక్తిని పెంచుతుంది.

ఎరువు... కూరగాయలు, పూల మొక్కలకు విడివిడిగా స్థలాన్ని కేటాయించుకోవడం మంచిది. దీంతోపాటు తోట పెంపకానికి అవసరమయ్యే సేంద్రియ ఎరువును వంటింటి వ్యర్థాలతో తయారుచేసుకునే విధానాన్ని నేర్చుకోవాలి. సాధ్యమైనంత రసాయనాలు వినియోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఒకసారి రసాయనాలు వేసిన నేల తిరిగి సహజంగా మారడానికి చాలా కాలం పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్