చపాతీ పిండి మృదువుగా ఉండాలంటే...
రోజువారీ ఆహారంలో చపాతీ తప్పనిసరిగా మారింది. ఏదో ఒకపూట దీన్ని తీసుకుంటూనే ఉంటాం. మరి చపాతీ పిండి తయారీలో పాటించాల్సిన మెలకువలేంటో, ఎలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయో తెలుసుకుందామా...
రోజువారీ ఆహారంలో చపాతీ తప్పనిసరిగా మారింది. ఏదో ఒకపూట దీన్ని తీసుకుంటూనే ఉంటాం. మరి చపాతీ పిండి తయారీలో పాటించాల్సిన మెలకువలేంటో, ఎలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయో తెలుసుకుందామా...
ఎక్కువగా నీళ్లు వాడొద్దు... చపాతీ పిండి కలిపేటప్పుడు అది మృదువుగా రావడం కోసం ఎక్కువ నీళ్లు కలపొద్దు. ఇలా చేస్తే పిండి మూతకు, చేసేటప్పుడు పీటకు, చేతులకు అతుక్కుపోతుంది. కాబట్టి పిండి తడిపేటప్పుడు వీలైనంత తక్కువ నీటిని వాడండి. ఒకవేళ పిండి మరీ మెత్తగా అయిపోయి చేతులకు అంటుకుంటూ ఉంటే కాస్తంత పొడి పిండి కలిపితే సరి.
కాస్త నూనె చాలు... పిండి తడిపే సమయంలో లేదా పూర్తిగా తడిపిన తర్వాత అందులో కొద్దిగా నూనె/నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువ సమయంపాటు మృదువుగా ఉంటాయి.
గోరువెచ్చని నీళ్లు లేదా పాలు... చపాతీ పిండి తడపడానికి గోరువెచ్చని నీళ్లు లేదా పాలు అందుబాటులో ఉంటే వాటినీ వాడుకోవచ్చు. వీటితో పిండిని కలిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి.
గాలి చొరబడని డబ్బాలో.. తయారుచేసి పెట్టుకున్న చపాతీ పిండిని ఫ్రిజ్లో భద్రపరిచే సమయంలో తప్పనిసరిగా మూత పెట్టాలి. లేదంటే పిండి పాడైపోతుంది.
ఇవి వాడాల్సిందే.. పిండి పూర్తిగా తడిపిన తర్వాత దానిపై కొద్దిగా నూనె/నెయ్యి పోసి పొరలా రాయాలి. ఇలా చేస్తే పిండి ఎండిపోదు, పాడవదు. ఈ పిండిని ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు పిండి తీసుకున్న ప్రతిసారి దాని మీద అల్యూమినియం ఫాయిల్ని కప్పి గాలి చొరబడని డబ్బాలో భద్రపరచడం మరవొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!