అందరూ కూర్చొనే గది అందంగా...

ఇంట్లో.. దాదాపు ఎక్కువసేపు గడిపేది హాలులోనే. కుటుంబంతో కలిసి గడిపే ప్రత్యేక సమయాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఎలా తీర్చిదిద్దుకోవచ్చో సూచిస్తున్నారిలా.

Published : 13 Dec 2021 01:24 IST

ఇంట్లో.. దాదాపు ఎక్కువసేపు గడిపేది హాలులోనే. కుటుంబంతో కలిసి గడిపే ప్రత్యేక సమయాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఎలా తీర్చిదిద్దుకోవచ్చో సూచిస్తున్నారిలా.

* ముగ్గురు, నలుగురికి సరిపోయేలా సిట్టింగ్‌ ఏరియాను సిద్ధం చేసుకోవచ్చు. నేలపై కార్పెట్‌ పరిచి దానిపై గదికి ఓ మూల లేదా మధ్యలో మెత్తని పరుపు సర్దాలి. పర్యావరణానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని మొత్తం పచ్చదనంతో నింపడానికి ప్రయత్నించాలి. పరుపుపై లేతవర్ణం దుప్పటి, దిండ్లు కవర్లు మ్యాచింగ్‌గా వేయాలి. ఈ సిట్టింగ్‌ ఏరియాకు పైభాగాన్ని మొత్తం చుట్టేలా ఒక వెదురు ఆర్చిని ఏర్పాటు చేసుకోవాలి. దీనికి రెండువైపుల నుంచి ఎదిగిన మనీప్లాంట్‌ను అల్లాలి. మధ్యమధ్యలో చిన్న సీరియల్‌లైట్లను బిగిస్తే చాలు. ఆ ప్రాంతమంతా ప్రత్యేకంగా మారిపోతుంది.

* తెలుపు, లేత నీలం, గులాబీ వర్ణంలో పల్చని వస్త్రాన్ని దోమతెర స్టైల్‌లో బెడ్‌కు గుడి గోపురంలా సర్దాలి.. దీనికి తీగ మొక్క లేదా ఇండోర్‌ ప్లాంట్‌ను అమర్చి సీరియల్‌ లైట్లు పెడితే చాలు. గది మొత్తం ఆహ్లాదంగా అనిపిస్తుంది. వెనుకవైపు గోడకు ఫ్యామిలీ ఫొటో ఫ్రేమ్స్‌ వేలాడదీసి చూడండి. ఆ చోటును వదలిపెట్టాలనిపించదు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

* ఆసక్తి ఉంటే బెడ్‌రూంను కూడా ఇలా సర్దుకోవచ్చు. బెడ్‌కు తలవైపు ఇరువైపులా త్రికోణం ఆకారంలో వెదురుతో ఆర్చిలా ఏర్పాటు చేయాలి. దీనికి మనీప్లాంట్‌ను పాకేలా అల్లాలి. ముందుభాగం వెదురుకు ఒకేవర్ణంలో వెలిగే సీరియల్‌ లైట్లను అమర్చాలి. అలాగే బెడ్‌పైభాగాన పూర్తిగా మనీప్లాంట్‌ మొక్కను పాకేలా చేస్తే చాలు. వీలైతే రెండు వైపులా కాళ్లవైపు మనీప్లాంట్స్‌ పాకేలా చూడండి. పడకగది అంతా  ప్రకృతిమయంగా ఉన్నట్లుగా, మానసికంగా హాయిగా అనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్