పాత బంగారాలివి..

ఇంట్లో పాత వస్తువులను వినియోగించకపోయినా... వాటిని జ్ఞాపకంగా దాచుకోవాలనిపిస్తుంది. అయితే స్థలాభావంతో వృథాగా అనిపించే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలా అనిపించిన వస్తువులను కూడా ఇంటి అలంకరణగా మార్చేసుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు..

Published : 27 Dec 2021 00:42 IST

ఇంట్లో పాత వస్తువులను వినియోగించకపోయినా... వాటిని జ్ఞాపకంగా దాచుకోవాలనిపిస్తుంది. అయితే స్థలాభావంతో వృథాగా అనిపించే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలా అనిపించిన వస్తువులను కూడా ఇంటి అలంకరణగా మార్చేసుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు..

మ్మమ్మ, నానమ్మ, అమ్మ వినియోగించిన పాత కుట్టుమిషన్‌ను భద్రపరుచుకోవాలన్నప్పుడు దాన్ని అందమైన బల్లగా మార్చుకోవచ్చు. హాల్‌ లేదా పడకగది కార్నర్‌లో ఉంచి దీనిపై ఫ్లవర్‌వాజ్‌ పెట్టి చూడండి. అలాగే  రీడింగ్‌ రూంలో మిషన్‌పై ఇరువైపులా రెండు ఫొటోఫ్రేములు, చివర నైట్‌ల్యాంపు సర్ది, పక్కన చిన్న మనీప్లాంట్‌ లేదా ఫ్లవర్‌వాజ్‌ ఉంచితే చాలు. అందమైన టేబుల్‌గా మారిపోతుంది.

ట్రంకుపెట్టె

బరువైన పాత ట్రంకు పెట్టెను టీపాయ్‌లా సర్దేయొచ్చు. గోడకు చేరవేసి దానిపై ముదురువర్ణం దుపట్టాను పరవండి. దీనిపై ఫొటో ఫ్రేం సర్ది పక్కగా ఇండోర్‌ ప్లాంట్‌ ఉంచితే చాలు. భలే ఉంటుంది. అలాగే పాత ట్రంకు పెట్టెకు ముదురు వర్ణం పెయింటింగ్‌ వేసి పడకగదిలో ఉంచినా బాగుంటుంది.  అలాగే హాలు మధ్యలో ఈ పెట్టెనుంచి వరుసగా ఇండోర్‌ మొక్కల తొట్టెలను సర్దితే చాలు. పాత టైర్లనీ ఇలానే అందంగా అమర్చుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్