Published : 01/01/2022 02:06 IST

ఇప్పుడే వాటి గురించి తెలుసుకోండి!

హిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదిస్తున్నారు. కానీ ఆ సంపాదన నుంచి సంపదని సృష్టించడం వాళ్లకింకా చేతకాలేదనే చెప్పాలి. సంపాదించినప్పుడే ఆదాయం.. ఉద్యోగం మానేస్తే కష్టం అనే పరిస్థితి నుంచి బయటపడి ఆర్థిక స్థిరత్వం రావాలంటే... సంపాదన బాగా ఉన్న సమయంలోనే వాటిని ఎక్కడెక్కడ పొదుపు చేయాలో ఆలోచించాలి.

బంగారానికి బదులు: మనలో చాలామంది బంగారం కొంటాం. కానీ దాన్నుంచి చెప్పుకోదగ్గ రిటర్నులు రావు. అదే గోల్డ్‌ బాండ్స్‌ కొని చూడండి. దానిపై కొంతకాలానికి వడ్డీ వస్తుంది. ఇదో రకం సంపద సృష్టే కదా! సిప్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి మాకేమీ తెలియదు అని కంగారు పడకండి. అదేం రాకెట్‌ సైన్స్‌ కాదు. మీరు డబ్బులు దాచుకునే బ్యాంకుకే వెళ్లి అడిగితే వాళ్లే వివరాలిస్తారు. మీది గ్రామీణ ప్రాంతం అనుకుంటే... పోస్టాఫీసులు ఉంటాయి కదా! అక్కడ ఏజెంట్లు ఉంటారు. వాళ్లని అడిగినా పథకాల గురించి చెబుతారు.

ఏ పత్రాలు ఎక్కడున్నాయి?: ఏ నిమిషంలో ఏమైనా జరగొచ్చు. కొవిడ్‌ సమయంలో ఈ విషయం మనందరికీ బాగానే అర్థమైంది. అందుకే మీవారి పీఎఫ్‌, ఎఫ్‌డీలు వంటివాటికి ఎవరు నామినీగా ఉన్నారో అడిగి తెలుసుకోండి. బీమా వంటివి ఉంటే వాటి కాగితాలు ఎక్కడ ఉన్నాయో అడిగి తెలుసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఆరోగ్య బీమా ఉందా? ఉంటే ఎంతకి? ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయి? ఈ వివరాలు తెలుసుకోకే చాలామంది ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. భర్తకి ఏమైనా అయి ఆసుపత్రిలో చేరితే డబ్బు ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక దిక్కుతోచక ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?: ఈ రోజు వస్తున్న ఆదాయం జీవితాంతం ఇలానే వస్తుంది అనుకుంటే తప్పులో కాలేసినట్టే. రేపటి గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్నవారు ఇప్పుడొస్తున్న ఆదాయంపై స్థిరమైన సంపదని సృష్టించే విధంగా ప్రణాళిక వేసుకోవడం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది వస్తే మరో ఆదాయ వనరు గురించీ ఆలోచించాలి.

- మాధవీరెడ్డి, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని