బ్యాగులో బ్లెండరు...

పండ్ల రసాలు, స్మూతీలు ఆరోగ్యానికెంతో మేలు. అయితే ఈ పరుగుల జీవితంలో పండ్ల రసాలకి చోటెక్కడ అని నిట్టూరుస్తున్నారా? అయితే ఈ మినీ పోర్టబుల్‌ బ్లెండర్‌ మీ దగ్గరుండాలి. దీనికి చిన్న జార్‌ ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు కొన్ని పండ్ల ముక్కల్ని కోసి ఫ్రిజ్‌లో ఉంచుకోండి.

Published : 18 Feb 2022 01:14 IST

పండ్ల రసాలు, స్మూతీలు ఆరోగ్యానికెంతో మేలు. అయితే ఈ పరుగుల జీవితంలో పండ్ల రసాలకి చోటెక్కడ అని నిట్టూరుస్తున్నారా? అయితే ఈ మినీ పోర్టబుల్‌ బ్లెండర్‌ మీ దగ్గరుండాలి. దీనికి చిన్న జార్‌ ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడు కొన్ని పండ్ల ముక్కల్ని కోసి ఫ్రిజ్‌లో ఉంచుకోండి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు గుప్పెడు పండ్ల ముక్కలను ఈ బ్లెండర్‌లోవేసి బ్యాగులో ఉంచుకుంటే చాలు. కావాలన్నప్పుడు స్విచ్‌ వేస్తే క్షణంలో పండ్ల రసం సిద్ధమవుతుంది. లేదంటే ఇంట్లోనే జ్యూస్‌ చేసుకొని అదే జార్‌ను బ్యాగులో వేసుకున్నా చాలు. నెమ్మదిగా పండ్ల రసాన్ని తాగొచ్చు. తేలికగానూ, చిన్న గ్లాసులా లేదా జార్‌లా అందమైన ఆకారాల్లో ఉండే ఈ బ్లెండర్‌ బ్యాగులో పట్టేస్తుంది. ఛార్జింగ్‌ చేసుకుంటే చాలు. బావుంది కదూ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్