బుడతకు.. బిబ్‌!

బుడి బుడి అడుగులు వేస్తోన్న బుడతలకు అన్నం తినిపించాలంటే అమ్మకు కష్టమే... కుదురుగా ఓ చోట ఉండరు. ఆహారాన్ని మీద పోసుకుంటారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బిబ్‌ చిన్నారికి ఆహారం మీద పడకుండా అడ్డుకుంటుంది. పొరపాటున మీద పడినా దీనికి ఉండే గిన్నెలాంటి వెడల్పైన భాగంలో పడిపోతుంది. వాటర్‌ ప్రూఫ్‌ కూడా. దాంతో పరిసర ప్రాంతాలూ శుభ్రంగా ఉంటాయి....

Published : 17 Mar 2022 00:38 IST

బుడి బుడి అడుగులు వేస్తోన్న బుడతలకు అన్నం తినిపించాలంటే అమ్మకు కష్టమే... కుదురుగా ఓ చోట ఉండరు. ఆహారాన్ని మీద పోసుకుంటారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బిబ్‌ చిన్నారికి ఆహారం మీద పడకుండా అడ్డుకుంటుంది. పొరపాటున మీద పడినా దీనికి ఉండే గిన్నెలాంటి వెడల్పైన భాగంలో పడిపోతుంది. వాటర్‌ ప్రూఫ్‌ కూడా. దాంతో పరిసర ప్రాంతాలూ శుభ్రంగా ఉంటాయి. ఈ బిబ్‌ పాపాయి మెడకు పొందికగా సరిపోతుంది. వీటికి ఉండే బటన్‌లతో కాలర్‌ను సెట్‌ చేసి మెడకు సులువుగా తగిలించవచ్చు. ఆరు నెలల పాపాయి నుంచి మూడేళ్ల బుజ్జాయిల వరకు అన్ని వయసుల వారికీ సరిపోయే ఆకృతుల్లో లభ్యమవుతున్నాయి. శుభ్రం చేయడమూ సులువే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్