చెంచా నిమ్మరసం... సూక్ష్మజీవులు ఖతం!

పోషకాల నిమ్మ.... వ్యాధినిరోధకతను పెంచడమే కాదు... వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను చంపేస్తుంది. నిమ్మరసాన్ని వంటల్లోనే కాకుండా వేరే రకంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దామా...

Published : 21 Mar 2022 01:53 IST

పోషకాల నిమ్మ.... వ్యాధినిరోధకతను పెంచడమే కాదు... వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను చంపేస్తుంది. నిమ్మరసాన్ని వంటల్లోనే కాకుండా వేరే రకంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దామా...

కూరగాయలను కడగడానికి... మరిగించిన వేడి నీళ్లలో నిమ్మరసం కలపాలి. ఈ నీటిలో కూరగాయలను వేసి అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే వాటిలో ఉన్న దుమ్ముధూళీతోపాటు సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇలా పండ్లనూ శుభ్రం చేయొచ్చు.

వంటగదిలోని సింక్‌ను క్లీన్‌ చేయడానికి... నిమ్మతొక్కలు, నిమ్మరసాన్ని కలిపి మెత్తగా గుజ్జులా చేయాలి. దీన్ని నల్లా మొత్తానికి పట్టించాలి. అయిదు నిమిషాల తర్వాత దీని మీద నిమ్మరసాన్ని పోసి మరో అయిదు నిమిషాలు నానబెట్టాలి. కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్ది, నీళ్లతో శుభ్రం చేస్తే కొత్తవాటిలా తళతళా మెరుస్తాయి.

పురుగులు పారిపోయేలా... వంటింట్లో.. చెత్త బుట్ట, సింక్‌ దగ్గర నలిమెలు (చిన్న రెక్కల పురుగులు) ఎగురుతూ చికాకు తెప్పిస్తాయి. వీటిని ఇలా దూరం చేసేయండి...

మగ్గు నీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా, వంటసోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిని స్ప్రే సీసాలో పోసి సింక్‌లో స్ప్రే చేసి కాసేపు వదిలేయాలి. పదినిమిషాల తర్వాత సింక్‌ను శుభ్రం చేస్తే చాలు. వారంలో మూడు, నాలుగుసార్లు ఇలా చేస్తే వీటి బాధ తప్పుతుంది.

వంటిల్లు తుడవడానికి... లీటరు వేడి నీటిలో రెండు చెంచాల చొప్పున నిమ్మరసం, వెనిగర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్లోర్‌పై చల్లి పొడి వస్త్రంతో తుడిస్తే సరి. నేల శుభ్రమవడమే కాకుండా సూక్ష్మజీవులు చనిపోతాయి. ఫ్లోర్‌ అంతా సువాసనలు వెదజల్లుతుంది.

కిచెన్‌ టవల్స్‌... వీటిపై వేల సంఖ్యలో సూక్ష్మజీవులు పేరుకుపోయి ఉంటాయి.  వీటిని తొలగించాలంటే నిమ్మరసం కావాల్సిందే. రెండు చెంచాల నిమ్మరసం కలిపిన లీటరు వేడి నీళ్లలో కిచెన్‌ టవల్స్‌ను పావుగంట నానబెట్టాలి. ఆ తర్వాత సబ్బుపెట్టి చేత్తో ఉతికితే సరి.. బ్యాక్టీరియాలు చనిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్