ఇది వంటింటి తోట!

కూరగాయలను కోశాక వ్యర్థాలను చెత్తబుట్టలో పడేస్తుంటాం. కొంచెం సృజనాత్మకతగా ఆలోచించి, అయిదు నిమిషాలు వెచ్చిస్తే చాలు.. ఈ వ్యర్థాలనూ.. తిరిగి మొలకెత్తేలా చేయొచ్చు. వంటింటి తోటను పెంచేయొచ్చు. అదెలాగో చూద్దాం..

Published : 29 Mar 2022 01:24 IST

కూరగాయలను కోశాక వ్యర్థాలను చెత్తబుట్టలో పడేస్తుంటాం. కొంచెం సృజనాత్మకతగా ఆలోచించి, అయిదు నిమిషాలు వెచ్చిస్తే చాలు.. ఈ వ్యర్థాలనూ.. తిరిగి మొలకెత్తేలా చేయొచ్చు. వంటింటి తోటను పెంచేయొచ్చు. అదెలాగో చూద్దాం..

రెండు మూడు అడుగుల పొడవు, వెడల్పున్న ప్లాస్టిక్‌ ట్రేను వంటింటి బాల్కనీలో ఉంచాలి. దీన్ని రెండు భాగాలుగా విడదీస్తూ చిన్న చెక్క అడ్డుగా పెట్టాలి. ఓవైపు కాస్తంత నీటిని చిలకరించాలి. ఉల్లి, క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, చిలగడదుంప, క్యాబేజీ వంటి వాటిని కోసేటప్పడు వాటి తల భాగాలను విడిగా కోసి ట్రేలో ప్రతిదాన్నీ దూరం దూరంగా సర్దాలి. వీటి అడుగుభాగం మాత్రమే తడిస్తే చాలు. వారంలోపు వీటి చివర్ల నుంచి చిగుర్లు మొదలవుతాయి. ట్రేలోని రెండో భాగంలో నీటిని నింపిన నాలుగైదు గాజు సీసాలను సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిలో ఆ మొలకెత్తిన చిలగడదుంప, ఉల్లి, క్యారెట్‌, అడుగు భాగాలు మునిగేలా ఉంచాలి. నెలరోజుల్లోపు వీటికి వేర్లు పెరిగి ఉల్లికాడలు, బీట్‌రూట్‌ ఆకులు, క్యారెట్‌ చిగుళ్లు వచ్చి చిన్ని తోటను తలపిస్తాయి. అవసరమైనప్పుడు తాజాగా కోసుకుని వంటల్లో వినియోగిస్తే చాలు. మరో రెండు వారాలకు ఇవి తిరిగి చిగురిస్తుంటాయి. అలాగే పెరిగిన క్యాబేజీ ఆకులు సూప్స్‌, సలాడ్స్‌కు అదనపు రుచిని అందిస్తాయి. అంతేకాదు, ఒక వెల్లుల్లి పాయ అడుగుభాగం తడిచేలా నీళ్ల సీసాలో ఉంచితే నెలరోజుల్లోపు చిగుళ్లు తొడుగుతాయి. ఉల్లికాడల్లా ఉండే ఈ ఆకులను కూడా వంటలో వాడొచ్చు. ఈ వంటింటి తోట ఆలోచన బాగుంది కదూ. అయితే మీరూ ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్