చపాతీలు మాడవిక!

చపాతీలని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పిండి సమంగా పరచుకోదు. ఒక్కో చోట కాస్త మందంగా, ఒక్కో చోట పల్చగా వస్తుంది. దాంతో పల్చగా ఉన్నచోట మాడుతూ, మందంగా ఉన్నచోట పచ్చిగా ఉంటుంది.

Updated : 02 Apr 2022 04:37 IST

చపాతీలని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పిండి సమంగా పరచుకోదు. ఒక్కో చోట కాస్త మందంగా, ఒక్కో చోట పల్చగా వస్తుంది. దాంతో పల్చగా ఉన్నచోట మాడుతూ, మందంగా ఉన్నచోట పచ్చిగా ఉంటుంది. ఇది మనందరికీ అనుభవమే. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఈ ఎడ్జస్టబుల్‌ రోలింగ్‌ పిన్‌ కొనుక్కుంటే సరిపోతుంది. చపాతీ కర్ర అంచుకు ఆ పిన్నును బిగించుకుంటే  చపాతీలు సమంగా వస్తాయి. కొందరు మరీ పల్చగా చపాతీలను ఒత్తుతారు. కొందరు కాస్త మందంగా తింటారు. పిన్నులని మార్చుకుంటూ కోరుకున్న మందంలో ఒత్తుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని