Published : 19/04/2022 01:36 IST

మ్యాటే బ్యాగవుతుంది!

నెలల పాపాయి నుంచి ఏళ్ల చిన్నారుల వరకు ఆడుకోవడానికి అనుగుణంగా రూపొందించిందే ఈ సరికొత్త మ్యాట్‌. దీనిపై చిన్నారులు బొమ్మలతో ఎంచక్కా ఆడుకోవచ్చు. నేల చల్లదనం వాళ్లకు ఇబ్బంది కలిగించదు. ఆడుకున్న తర్వాత ఆ బొమ్మల న్నింటినీ దానిమీదే పెట్టేసి చుట్టూ ఉండే తాడును దగ్గరకు లాగితే గుండ్రటి బ్యాగులా మారిపోతుంది. అవసరమై నపుడు కూర్చొని ఆడుకునే మ్యాట్‌లా... ఆ తర్వాత ఆట వస్తువులకు బ్యాగులా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని సులభంగా శుభ్రం చేయొచ్చు కూడా. చిన్నారులకు పుట్టినరోజు కానుకగా ఇవ్వడానికీ బాగుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని