కార్పెట్లు.. అందమూ సౌకర్యమూ

హాలు, పడకగది, చిన్నారుల కోసం అంటూ ప్రత్యేకంగా వేసే కార్పెట్లు సౌకర్యంతోపాటు గదుల అందాన్నీ పెంచుతున్నాయి. ప్రస్తుతం ఆధునికతకు తగినట్లుగా విభిన్న డిజైన్లతో వినియోగదారులను మెప్పిస్తున్నారు డిజైనర్లు. అయితే గదికి తగిన కార్పెట్లను ఎంచుకోవడంలో నాణ్యతతోపాటు రంగులకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నిపుణులు.

Published : 02 May 2022 00:48 IST

హాలు, పడకగది, చిన్నారుల కోసం అంటూ ప్రత్యేకంగా వేసే కార్పెట్లు సౌకర్యంతోపాటు గదుల అందాన్నీ పెంచుతున్నాయి. ప్రస్తుతం ఆధునికతకు తగినట్లుగా విభిన్న డిజైన్లతో వినియోగదారులను మెప్పిస్తున్నారు డిజైనర్లు. అయితే గదికి తగిన కార్పెట్లను ఎంచుకోవడంలో నాణ్యతతోపాటు రంగులకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నిపుణులు.

లివింగ్‌ రూంలో...

కుటుంబ సభ్యులందరూ ఎక్కువసేపు సమయాన్ని గడిపే లివింగ్‌ రూంలో మెత్తగా గదిలోని ఫర్నిచర్‌కు మ్యాచ్‌ అయ్యేలా పఫ్ఫీ కార్పెట్లు వస్తున్నాయి. టీవీ చూడటానికి అందరూ సోఫాలోనే కాకుండా దీనిపై కూడా విశ్రాంతిగా కూర్చొని మరీ సరదాగా గడపొచ్చు.

చిన్నారుల గదిలో..

ఇంద్రధనస్సు, కార్టూన్లు, రకరకాల జంతువుల బొమ్మలతో వచ్చే కార్పెట్లు చిన్నారుల గదులకు ప్రత్యేకం. వీటిని చూసినప్పుడల్లా పిల్లల్లో సృజనాత్మకత పెరిగేలా కూడా రకరకాల క్విజ్‌ బొమ్మలతో వస్తున్నాయి. అంతేకాదు.. పిల్లలు కింద కూర్చుని ఆడుకునేందుకు సౌకర్యంగా రగ్స్‌లాంటి మెత్తని కార్పెట్లు రక రకాల ప్రకృతి డిజైన్లతో చిన్నారులను మరింత ఆకర్షిస్తున్నాయి.

పడకగదికి...

సుతిమెత్తగా పాదాలకు తగిలే కార్పెట్‌.. పడక గదిలో మనసుకు ప్రశాంతతను నిస్తుంది.. లేతవర్ణాలు, గోడలకు మ్యాచ్‌ అయ్యేలా పలు డిజైన్లలో వస్తున్న కార్పెట్లు బెడ్‌రూమ్‌కు ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెస్తాయి. కనీసం నెలకొకసారి దీనిపై పేరుకొనే దుమ్మును దులిపి శుభ్ర పరచడం మంచిది. లేదంటే వీటితో అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే అప్పుడప్పుడూ బయట ఎండలో కొంతసేపు ఉంచితే వీటిపై చేరే బ్యాక్టీరియాలు చనిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్