ప్రకృతికి దగ్గరగా...

ఇంటి వెనుక పెంచే తోటకు ఓవైపుగా ఓ చిన్న గది ఏర్పాటు మనల్ని ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. ఖాళీ సమయాల్లో ఇక్కడ కూర్చుని ఓ కప్పు టీ తాగుతూ ఇష్టమైన పుస్తకాన్ని చదువుకుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం.

Published : 07 May 2022 00:38 IST

ఇంటి వెనుక పెంచే తోటకు ఓవైపుగా ఓ చిన్న గది ఏర్పాటు మనల్ని ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. ఖాళీ సమయాల్లో ఇక్కడ కూర్చుని ఓ కప్పు టీ తాగుతూ ఇష్టమైన పుస్తకాన్ని చదువుకుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం.

తోటంతా కనిపించేలా ఓ మూలగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని గది ఏర్పాటుకు తగినట్లుగా చతురస్రాకారం లేదా త్రికోణంగా వచ్చేలా చదును చేసుకోవాలి. కాంక్రీట్‌తో కాకుండా గది నిర్మాణం సహజసిద్ధంగా అనిపించేట్లు వెదురుతో పూరి గుడిసెలా వేసుకుంటే మరీ మంచిది. చూడటానికి అందంగానే కాదు.. అక్కడ కూర్చుంటే తోటలో పూసే పూలన్నీ మనల్ని పలకరించేలా అనిపించాలి. గది లోపల రెండు కుర్చీలు, ఓ బల్ల, పక్కగా రెండు మూడు ర్యాక్స్‌తో స్టాండు ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా వెదురు లేదా చెక్కతో చేసిన ఫర్నిచర్‌ అయితే మరింత సహజంగా ఉంటుంది.  

ఆకర్షణీయంగా... బల్లపై ఓ పక్కగా చదవాల్సిన పుస్తకాలు, మధ్యలో ఒక చిన్న ఫ్లవర్‌వాజ్‌ ఉంచాలి. రోజూ తోటలో పూసిన తాజా పూలను ఇందులో మారుస్తూ ఉండాలి. కుర్చీల్లో ముదురువర్ణం కవర్లతో కుషన్లు లేదా దిండ్లు సర్దాలి. చుట్టూ పచ్చని మొక్కల మధ్య ఈ రంగులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్టాండులో ఇండోర్‌ప్లాంట్స్‌ ఉన్న చిన్నచిన్న తొట్టెలనుంచాలి. తోటలో వేసే కొత్తమొక్కలు ఎదిగేటప్పుడు ఎండ ఎక్కువ అవసరం ఉండదు. అటువంటి వాటిని తాత్కాలికంగా ఉంచడానికి ఈ స్టాండు సౌకర్యంగా ఉంటుంది. చూడటానికి ఇవి అందంగానూ కనిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్