తాళ్లతో మొక్కలకు నీరు..
పిల్లలకు వేసవి సెలవులు మొదలయ్యాయి. నాలుగైదు రోజులపాటు ఎక్కడికైనా టూర్‌కు తీసుకెళ్దామంటే ప్రేమగా పెంచుతున్న మొక్కల పరిస్థితేంటని ఆలోచిస్తున్నారా.. మీరు వచ్చేవరకు మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
పిల్లలకు వేసవి సెలవులు మొదలయ్యాయి. నాలుగైదు రోజులపాటు ఎక్కడికైనా టూర్‌కు తీసుకెళ్దామంటే ప్రేమగా పెంచుతున్న మొక్కల పరిస్థితేంటని ఆలోచిస్తున్నారా.. మీరు వచ్చేవరకు మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.
అయిదారు లీటర్ల నీళ్లు పట్టే పెద్ద పాత్రనుంచడానికి వీలుగా ఎత్తైన స్టాండు ఏర్పాటు చేయాలి. దీని చుట్టూ వచ్చేలా కింద ఇండోర్ మొక్కల్ని సర్దాలి. 3, 4 అడుగుల పొడవున్న జనపనార, కొబ్బరి తాళ్లను తీసుకొని వాటికి చివర్లలో బరువైన రాయి లేదా ఏదైనా వస్తువు కట్టాలి. అలాగే నిమ్మకాయంత గులక రాయిని ఒక సన్నని పొడవైన వృథా వస్త్రం చివర్లో చుట్టి దారంతో ముడివేయాలి. మిగిలిన వస్త్రాన్ని పొడవుగా చుడుతూ తాడులా చేసుకోవాలి. బరువున్నవైపు పాత్రలో మునిగి మిగతాభాగమంతా కిందకు వేలాడేలా తాళ్లను పాత్రలో వేయాలి. ఈ తాళ్లలో ఒక్కొక్కదాన్ని తలా మొక్క మొదళ్లలో మట్టిలో ఉండేలా దోపి పైకి కదలకుండా తాడుపై ఏదైనా బరువుంచాలి. అలా ప్రతి మొక్కకు ఒక్కొక్క తాడును ఏర్పాటు చేసుకోవాలి. బయటకెళ్లేటప్పుడు స్టాండుపై ఉంచిన పాత్రను నీటితో నింపాలి. గిన్నెలో ముందుగానే వేసిన తాళ్లు నీటిని పీల్చుకోవడంతో ఆ చెమ్మ కింద ఉంచిన కుండీల్లోకి చేరుతుంది. దీంతో మొక్కకు చెమ్మదనం అందుతుంటుంది. అయిదారు రోజులపాటు ఇండోర్ మొక్కలకు విడిగా నీటి అవసరం ఉండదు.
సీసాలతో... మార్కెట్‌లో సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్ పాట్స్ అని లభ్యమవుతున్నాయి. అడుగున గాజు బౌల్ ఉండి, దానికి పైన అమర్చేలా ప్లాస్టిక్ తొట్టె ఉంటుంది. దీనికి అడుగుభాగాన రెండు రంధ్రాలుంటాయి. రెండు మూడు రోజులు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు జనపనార లేదా కొబ్బరి తాళ్లను తొట్టె నుంచి బౌల్ అడుగు వరకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. తొట్టెలో మొక్క ఉన్నప్పుడు బౌల్‌ను నీటితో నింపాలి. బౌల్ నుంచి తాళ్ల ద్వారా తొట్టెలోని మొక్కకు నీరు అందుతుంది. లీటరు నీళ్లు పట్టే డిస్పోజబుల్ సీసాలను తీసుకొని వాటి మూతలకు సన్నటి రంధ్రం చేయాలి. సీసాను నీటితో నింపి తలకిందులుగా కుండీలో గుచ్చినట్లుగా ఉంచితే చాలు. మొక్కకు నీరు అందుతూ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- జుట్టు నెరుస్తోంది.. ఏం తినాలి?
- ముంజేతికి.. ముచ్చటగా!
- అలసిన చర్మానికి సాంత్వన ఇలా!
- కళ్లకు.. కొత్త కళ!
- ఆరోగ్యంగా.. వన్నెచిన్నెలు
ఆరోగ్యమస్తు
- అందుకే నేలపై కూర్చొని తినాలట!
- పోషక గనులు.. చిరు ధాన్యాలు!
- దిండు వద్దు...
- కడుపుబ్బరమా? అయితే ఇలా చేయండి!
- కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..
అనుబంధం
- పెళ్లైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటోంది..!
- ఉమ్మడి కుటుంబంలో కలిసేలా..
- ఆ అబ్బాయి వల్ల కాలేజీ మాన్పించారు.. ఏం చేయాలి?
- అతి సౌకర్యాలతో అధిక చింతలు
- Relationship Tips: అది చూసే దృష్టిని బట్టే ఉంటుందట!
యూత్ కార్నర్
- వారమంతా ఉద్యోగం.. వారాంతాల్లో వ్యాపారం!
- Payal Chhabra: దేశం కోసం విదేశీ ఆఫర్లనూ తిరస్కరించింది!
- ప్రపంచ గమనాన్ని మార్చేందుకే నా పర్యటనలు!
- Jayashree : 70 గంటలు విమానం నడిపి..!
- ఆసియా క్రీడల్లో.. తొలి సంతకం!
'స్వీట్' హోం
- ఇలా చేస్తే దోమల బెడద ఉండదు!
- చపాతీ కర్రే.. కాస్త వెరైటీగా!
- టీ, కాఫీ మరకలు పోలేదా..
- తోటపని సులువుగా...
- పూజ వేళ.. ఆకలి వేయకుండా!
వర్క్ & లైఫ్
- పని ప్రదేశంలో వారికే వేధింపులెక్కువట!
- మీకు మీరే రక్ష!
- Women Reservation Bill : 33 శాతానికి.. మూడు దశాబ్దాలు పట్టింది?
- సిబ్బందిలో ప్రేరణ కలిగించాలంటే..!
- ఈ చిట్కాలు పాటిస్తే కుడుములు అదుర్స్!