పాత దుస్తులతో మ్యాట్లు...
మనం వేసుకునే దుస్తులు చిరిగినా, పాతబడినా బయట పడేస్తుంటాం. అలాకాకుండా పునర్వినియోగించుకునే లా మార్చుకుంటే బాగుంటుంది. దీని వల్ల డబ్బు ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్నీ సురక్షితంగా ఉంచగలుగుతాం.
మనం వేసుకునే దుస్తులు చిరిగినా, పాతబడినా బయట పడేస్తుంటాం. అలాకాకుండా పునర్వినియోగించుకునే లా మార్చుకుంటే బాగుంటుంది. దీని వల్ల డబ్బు ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్నీ సురక్షితంగా ఉంచగలుగుతాం. అది ఎలానో చూద్దాం..
- దుస్తులు పాతవైతే పారేయడంకన్నా వాటితో కాలిమ్యాట్లను తయారుచేసుకోవచ్చు. ముందుగా కత్తెరతో సన్నగా పాయల్లా కత్తిరించుకోవాలి. వాటిని జడ అల్లుకున్నట్లు మూడు పాయలు తీసుకొని అల్లుకోవాలి. ఇలా ఐదారు చేసి, వాటిని మనకు నచ్చిన ఆకారంలో ఒక్కదానికొకటి జత చేస్తూ కుట్టాలి. వీటిని రెండు మూడు రంగుల్లో చేస్తే చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మెత్తగా సౌకర్యవంతంగా అనిపిస్తుంది.
- ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి, ఆరోగ్యానికి చేటు చేస్తాయని మనందరికీ తెలుసు. అందుకే గతంలో వస్త్రాలతో చేసే సంచుల్ని వాడేవారు. ఆ అలవాటును తిరిగి మొదలు పెట్టొచ్చు. కుట్టు మెషీన్‌పై పాతదుస్తుల్ని సంచుల్లా కుట్టేయొచ్చు. వీటి వల్ల డబ్బులు ఆదా అవుతాయి. ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు..అలానే వాషింగ్‌మెషీన్, ఫ్రిజ్ వంటి వాటికి కవర్లు తయారుచేయొచ్చు. దుమ్ము, ధూళి పడకుండా కప్పొచ్చు.
- అలంకరణకు సంబంధించిన డెకరేషన్ ఫ్లవర్స్ తయారు చేసుకొని ఇంట్లో అందంగా అలంకరించుకోవచ్చు. బెడ్‌షీట్లు, కుషన్, డోర్‌కర్టెన్లను తయారు చేసుకోవచ్చు. కుషన్ కవర్లలో వీటిని నింపి దిండ్లుగానూ వినియోగించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.