తెలుపు దుస్తులే ఎందుకు?

హోలీ... ఈ రంగుల సంబరంలో పెద్దలూ చిన్న పిల్లలైపోతారు. కానీ ఆ వర్ణాలను వదిలించడానికి చాలా కష్టపడాలి. ఇదంతా తెలిసీ చాలామంది హోలీ నాడు తెలుపు రంగు దుస్తులే ధరిస్తారు. అందుకు కారణమేంటి? ఈ సందేహం మీకూ వచ్చిందా... అయితే తెలుసుకుందాం రండి!

Updated : 25 Mar 2024 07:15 IST

హోలీ... ఈ రంగుల సంబరంలో పెద్దలూ చిన్న పిల్లలైపోతారు. కానీ ఆ వర్ణాలను వదిలించడానికి చాలా కష్టపడాలి. ఇదంతా తెలిసీ చాలామంది హోలీ నాడు తెలుపు రంగు దుస్తులే ధరిస్తారు. అందుకు కారణమేంటి? ఈ సందేహం మీకూ వచ్చిందా... అయితే తెలుసుకుందాం రండి!

హోలీనాడు రాహువు చాలా కోపంగా ఉంటాడట. దాంతో ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎదురవ్వడం, తెలియకుండానే నోరు జారడం, ఇంట్లోవాళ్లతో గొడవలు... ఇలాంటి వాటన్నింటికీ అవకాశం ఉంటుందట. అందుకే ఆయన కోపాన్ని తప్పించుకోవడానికి తెలుపు దుస్తులు ధరిస్తారని ‘సనాతన ధర్మం’ చెబుతోంది. ఆధునిక అమ్మాయిలం. ఇలాంటి వాటిపై మాకు నమ్మకం లేదంటారా? అయితే దీని వెనక శాస్త్రీయ కారణమూ లేకపోలేదు. ఫాల్గుణ మాసంలో వచ్చే హోలీ ఆనందానికీ, ఉత్సాహానికీ ప్రతీకగా చెబుతారు. సాధారణంగా ఏ పండగైనా అయినవాళ్లు, తెలిసిన వాళ్లతోనే జరుపుకొంటాం. హోలీకి ఈ మినహాయింపు ఉంటుంది. తెలియని వాళ్లైనా వచ్చి రంగు పూయడం సర్వసాధారణం. ఇంకా ‘హోలీ అండీ... ఇవన్నీ మామూలే’ అంటూ ఓ సమాధానమూ వినిపిస్తుంది. నిజానికి ఈ పండగ ఉద్దేశం కూడా అదే! చుట్టూ ఉన్నవాళ్లతో కలిసి మెలిసి, సోదరభావంతో సాగమనే! దీంతో ‘కమ్యూనికేషన్‌ స్కిల్స్‌’ మెరుగుపడతాయి కూడా. అంతేకాదు, వసంతంలో వచ్చే ఈ పండగ నాటికి ఎండ తీవ్రత పెరుగుతుంది. దాన్ని తట్టుకునేందుకు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం సంప్రదాయంగా వస్తోంది. పైగా రంగుల పండగ... వర్ణాలన్నీ దుస్తులపై కనిపించి మురిపిస్తేనేగా సంబరం! అవలా కనిపించేలా చేయడంలో ధవళ వర్ణానికి పోటీ ఏముంటుంది చెప్పండి? అదండీ ‘తెలుపు’ వెనక ఉన్న రహస్యం. వేసుకోవడానికి మీరూ సిద్ధమా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్