రిజెక్ట్‌ అయ్యారా?

రాధిక నెలకు రూ 15వేలు సంపాదించేది. ఆమె పని చేస్తున్న సంస్థ కొవిడ్‌ కారణంగా మూతబడిపోయింది. దాంతో మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసుకున్నా, రిజెక్ట్‌ అవుతోంది.

Published : 16 Jun 2021 00:39 IST

రాధిక నెలకు రూ 15వేలు సంపాదించేది. ఆమె పని చేస్తున్న సంస్థ కొవిడ్‌ కారణంగా మూతబడిపోయింది. దాంతో మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్ని సంస్థలకు దరఖాస్తు చేసుకున్నా, రిజెక్ట్‌ అవుతోంది. ఏం చేయాలో పాలుపోక, కుటుంబానికి సాయం అందించలేకపోతున్నానని వేదనకు గురవుతోంది. ఇది తనలాంటి చాలామంది సమస్యే. అప్లికేషన్‌ తిరస్కారానికి గురైనంతమాత్రాన నిరుత్సాహపడనక్కర్లేదు అంటున్నారు మానసిక నిపుణులు. రిజెక్షన్‌లోనే విజయం దాగి ఉంది అని చెబుతున్నారు.

ఓటమి అనుకోకుండా... ఒకటీరెండు సార్లు దరఖాస్తు తిరస్కరణకు గురయినంత మాత్రాన అది పూర్తిగా మీ వైఫల్యం అనుకోకూడదు. ఈ మాత్రం దానికే కుంగిపోవడం, మరోచోట అప్లై చేయడానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. దీన్ని ఓటమిగా భావించకుండా, ఎలాగైనా సాధించడానికి కృషి చేస్తూనే ఉండాలి. వైఫల్యంతోపాటే విజయం కూడా ఉంటుందని గుర్తిస్తే చాలు. ప్రయత్నం చేయడం దానంతటదే అలవడుతుంది.
* నైపుణ్యాలు...  ఏ సంస్థకు మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, దానికి సంబంధించిన పూర్తి అధ్యయనం చేయాలి. ఆ సంస్థ అభివృద్ధి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతే కాదు, అప్లై చేస్తున్న ఉద్యోగానికి ఎటువంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి, వాటిలో శిక్షణ తీసుకుంటే మంచిది. ఇప్పుడు చాలా కోర్సులను ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, విజయం మీదే.  
* దరఖాస్తులో... మీ అనుభవాలను పూర్తిగా పొందుపరచడం మరవకూడదు. గతంలో ఆయా సంస్థల్లో మీరు సాధించిన విజయాలు, పొందిన ప్రశంసల గురించి కూడా చేరిస్తే మీపై అవతలివారికి ఓ నమ్మకం కలుగుతుంది. మీ గురించి తెలుసుకునే వీలుంటుంది. అవకాశమిస్తే, సంస్థ అభివృద్ధిలో మీరు ఎలా భాగస్వాములవుతారన్నది వారికి దరఖాస్తులో వివరించాలి. అప్పుడు విజయావకాశాలు పెరుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్