వీళ్లేం పాపం చేశారు?

పెరుగుతున్న కాలుష్యం బారిన మనం పడుతున్నాం సరే! భవిష్యత్‌ తరాలు కూడా ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సిందేనా? ‘అయితే కడుపులో ఉన్న ఈ పసికందులకు ఏం సమాధానం చెబుతారో చెప్పండి?’ అంటూ బ్రిటన్‌ ప్రధానిని ప్రశ్నించారీ ఆరుగురు గర్భిణులు.

Published : 11 Aug 2021 01:27 IST

పెరుగుతున్న కాలుష్యం బారిన మనం పడుతున్నాం సరే! భవిష్యత్‌ తరాలు కూడా ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సిందేనా? ‘అయితే కడుపులో ఉన్న ఈ పసికందులకు ఏం సమాధానం చెబుతారో చెప్పండి?’ అంటూ బ్రిటన్‌ ప్రధానిని ప్రశ్నించారీ ఆరుగురు గర్భిణులు. మితిమీరిన శిలాజ ఇంధనాల వాడకం, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటివాటి కారణంగా... ఈ ఏడాది ఎన్నడూలేనంతగా లండన్‌లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇందుకు నిరసనగా తమ గర్భంపై ‘మా భవిష్యతు’్త అని రాసుకుని... బొడ్డుతాడుని పోలిన పైప్‌లైన్‌తో వారి అసహనాన్ని వినూత్నంగా వ్యక్తం చేశారీ గర్భిణులు. ‘శిలాజ ఇంధనాల వాడకంపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నదే మా డిమాండ్‌’ అంటున్నారీ కాబోయే అమ్మలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్