డిప్రెషన్‌కు చెక్‌ పెట్టేయండి!

అటు ఇంటి పనిని, ఇటు ఉద్యోగ బాధ్యతలను నేర్పుగా చక్కబెట్టుకునే మహిళలు ఒక్కోసారి అలసట, ఆందోళనలతో డస్సిపోతుంటారు. ఆ ఒత్తిడితో డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదమూ ఉంది. దాన్నుంచి బయటపడేందుకు మానసిక వైద్యుల సూచనలు చూడండి...

Published : 28 Nov 2021 01:29 IST

అటు ఇంటి పనిని, ఇటు ఉద్యోగ బాధ్యతలను నేర్పుగా చక్కబెట్టుకునే మహిళలు ఒక్కోసారి అలసట, ఆందోళనలతో డస్సిపోతుంటారు. ఆ ఒత్తిడితో డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదమూ ఉంది. దాన్నుంచి బయటపడేందుకు మానసిక వైద్యుల సూచనలు చూడండి...

* విషయం ఎంత క్లిష్టమైనదైనా... ఒంటరిగా కుమిలిపోవద్దు. మనసులో గూడు కట్టుకున్న బాధను మరొకరితో పంచుకున్నప్పుడే భారం తీరుతుంది. కాబట్టి, ఆప్తులతో చెప్పుకోండి. కష్టంలో ఉన్నవారి కంటే పక్కనుంచి చూసేవారికే మార్గం బోధపడుతుంది.

* ఒక వ్యక్తి వల్ల మీరు బాధపడుతోంటే.. అదే తలచుకుని మదనపడటం, ఇతరులతో చెప్పి వ్యధ చెందటం లాంటివి చేయొద్దు. అసలు వ్యక్తితోనే నేరుగా మాట్లాడండి. అరమరికలు లేకుండా మాట్లాడినప్పుడు అవతలివారిలో తప్పకుండా మార్పు వస్తుంది.

* నిరంతరం పని చేయడం వల్ల శారీరకంగానే గాక మానసికంగానూ అలసిపోతారు. మధ్యలో చిన్నచిన్న విరామాలూ తీసుకోవాలి. కొంత సమయం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. అది అదనపు బాధ్యతగా అనిపించదు, ఇతరుల కోసం తోచింది చేస్తున్నాననే సంతృప్తి, సంతోషం కలుగుతాయి.

* చిన్నాపెద్దా అందర్నీ కనిపెట్టుకుని ఉండటంతోబాటు మీ గురించి కూడా కాస్త పట్టించుకోండి. మంచి పోషకాహారం, చక్కటి నిద్ర చాలా అవసరం. మీ మీద మీకే శ్రద్ధ లేకపోతే ఇతరులకు ఎందుకుంటుంది చెప్పండి?! నచ్చిన వ్యాపకాలు కల్పించుకున్నా ఊరట దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్