Updated : 10/12/2021 01:46 IST

డిఫెన్స్‌ కెరియర్‌ అవకాశాలపై..ఆన్‌లైన్‌ సెమినార్‌!

హనానికే కాదు.. సాహసానికీ చిరునామాగా నిలుస్తున్నారు నేటితరం అమ్మాయిలు. అయినా దేశరక్షణ విభాగంలో నిన్న మొన్నటివరకూ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కే మన సేవలు పరిమితమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మనమూ ఇక శాశ్వత విధుల్లో పనిచేయొచ్చు! మాతృభూమికి సేవ చేయాలనుకునే అమ్మాయిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా సందేహమా? వాటిని మేం తీరుస్తాం. ఈనాడు ఆధ్వర్యంలో ‘సాయుధ బలగాల్లో ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై ఈ నెల 11న ఆన్‌లైన్‌ సదస్సును నిర్వహిస్తున్నాం. ఉదయం 11గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకూ ఈ కార్యక్రమం ఉంటుంది. త్రివిధ దళాల్లో ఉద్యోగావకాశాలు, ఉద్యోగప్రకటనలు, ప్రవేశపరీక్షలకు సంబంధించి అర్హతలు, సన్నద్ధత, ఇంటర్వ్యూ సహా అన్నింటి గురించీ ఇక్కడ తెలుసుకోవచ్చు. విశాఖ తూర్పు నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ విజయలక్ష్మి, కెప్టెన్‌ ఎస్‌.రవీంద్ర ఈ అంశాలపై ప్రసంగిస్తారు. అనుమానాల నివృత్తికి ప్రశ్నోత్తరాల సమయమూ ఉంటుంది. సాయుధ బలగాలపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

* రిజిస్ట్రేషన్లకు మీ పేరు, ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీ వివరాలతో 8008055788 నంబరుకు ఈరోజు సాయంత్రం 5గం.లోగా  మెసేజ్‌ చేయండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి