మనసుకీ..చోటిచ్చారా?

కొత్త ఏడాది వస్తోందంటే.. కొన్ని ప్రణాళికలు, తీర్మానాలు చేసుకుంటాం. కొవిడ్‌, ఇంటి నుంచే పని, ఆన్‌లైన్‌ తరగతులు, ఫేక్‌న్యూస్‌.. ఇలా ఎన్నో ఈ సంవత్సరం మెంటల్‌ హెల్త్‌పై దుష్ప్రభావాలు

Updated : 19 Oct 2022 16:06 IST

కొత్త ఏడాది వస్తోందంటే.. కొన్ని ప్రణాళికలు, తీర్మానాలు చేసుకుంటాం. కొవిడ్‌, ఇంటి నుంచే పని, ఆన్‌లైన్‌ తరగతులు, ఫేక్‌న్యూస్‌.. ఇలా ఎన్నో ఈ సంవత్సరం మెంటల్‌ హెల్త్‌పై దుష్ప్రభావాలు చూపాయి. కాబట్టి, ఈసారి వాటిల్లో మనసుకీ ప్రాధాన్యమివ్వండి. అదెలాగంటే..

స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో సమయం గడపడాన్ని నియమంగా పెట్టుకోండి. ఇదెలాగూ చేసేదే కదా! అనుకోకండి. పనికిలాగే దీనికీ కచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి. తప్పక పాటించడానికి ప్రయత్నించాలి.

* ‘రేపటిపై అనిశ్చితి’ని పాఠంగా నేర్పింది కొవిడ్‌. మనసులోని భావాల్ని తప్పక పంచుకుంటా అని తీర్మానించుకోండి. ఆరోగ్యకరమైన డైట్‌, చిన్న వ్యాయామాలనూ జాబితాలోకి చేర్చుకోండి. సమయం తక్కువా.. డ్యాన్స్‌, బ్రీతింగ్‌ టెక్నిక్‌లను ఎంచుకుంటే సరి.

* కొత్తవి నేర్చుకోవడం, పాతవాటికి మెరుగులు దిద్దుకోవడంపై దృష్టిపెట్టండి. కష్టంగా భావించే వాటిని కాకుండా ఇష్టంగా ఆస్వాదించే వాటికే ప్రాధాన్యమివ్వండి. అప్పుడే మనసూ ఉల్లాసంగా ఉంటుంది.

* తప్పకుండా పూర్తిచేయగలను అనుకున్న వాటినే లక్ష్యాలుగా పెట్టుకోండి. నిరాశ ఉండదు. అలాగే నెగెటివిటీకీ, దాన్ని పంచేవారికీ దూరంగా ఉండండి.

చిన్నవే కదూ.. మనసుకీ హాయి, విజయవంతంగానూ పూర్తిచేయొచ్చు! చేర్చుకోండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్