నాయికా.. సిద్ధమా

నేటి తరం అమ్మాయిలు ఉద్యోగాలకే పరిమితం అవ్వాలనుకోవడం లేదు. సొంత వ్యాపారం ఎక్కువమంది లక్ష్యమవుతోంది. మీరూ నాయకత్వ పగ్గాలు పట్టి నలుగురిని నడిపించాలనుకుంటున్నారా? అయితేే..

Published : 20 Mar 2022 00:35 IST

నేటి తరం అమ్మాయిలు ఉద్యోగాలకే పరిమితం అవ్వాలనుకోవడం లేదు. సొంత వ్యాపారం ఎక్కువమంది లక్ష్యమవుతోంది. మీరూ నాయకత్వ పగ్గాలు పట్టి నలుగురిని నడిపించాలనుకుంటున్నారా? అయితేే..
* ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు పూర్తిగా వినండి. ఇది ఎదుటివారికి మీరిచ్చే కనీస గౌరవం. కిందివారు అని కాకుండా తోటి పనివారుగా భావించగలగాలి. అప్పుడు వాళ్లకీ మన అన్నభావం ఏర్పరిచినవారవుతారు. ఫీడ్‌బ్యాక్‌, సలహాల్లాంటి వాటిని ఎవరిచ్చినా తీసుకోగలగాలి. గడువులు వంటి వాటిని అందరితోపాటు మీరూ పాటించగలగాలి. ఏదైనా తప్పు జరిగినా దానికి బాధ్యత తీసుకోగలగాలి.
* కమ్యూనికేషన్‌.. ఏ వ్యాపారానికైనా సక్సెస్‌ మంత్రం. అన్ని స్థాయుల వారితో మాట్లాడుతుండండి. మీ ఆలోచనలు, వారి నుంచి మీరేం ఆశిస్తున్నారు, వ్యూహాలు వంటివి అర్థమయ్యేలా చెప్పండి. సందేహాలున్నా ఓపిగ్గా తీర్చాలి. చేసిన పనిలో స్పష్టత ఉన్నప్పుడే దాన్ని సక్రమంగా పూర్తిచేయాలన్న స్ఫూర్తి ఏర్పడేది!
* సంస్థ అన్నాక భిన్న నేపథ్యాల వాళ్లు పనిచేస్తుంటారు. వారందరినీ కలుపుకోగల వాతావరణం అందించగలగాలి. పనితీరుకు ప్రాధాన్యం ఇవ్వాలి తప్ప వారి స్థాయి, ఇతర అంశాలకు కాదు. అలాగే సమస్య ఎదురైనప్పుడు ఏ ఒక్కరివైపో మొగ్గు చూపకూడదు. ఇరువైపు కోణాలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. మీరు పాటిస్తూ పై స్థాయులవారికి అలవాటు చేయాల్సిన సూత్రమిది. అప్పుడే అందరి నమ్మకాన్ని
చూరగొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్