పెళ్లంటే భయమేస్తోంది...
నా వయసు 26. గత ఏడాది నాన్న చనిపోయారు. చిరుద్యోగం చేస్తున్నాను. ఆస్తులేమీ లేవు. నా పెళ్లి, ఇతర బాధ్యతలతో అమ్మ కుంగిపోతోంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్ దగ్గరికి రాను, బానే ఉన్నానంటుంది. నేను కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటే ‘నువ్వెందుకు ఇవన్నీ ఆలోచిస్తావు’
నా వయసు 26. గత ఏడాది నాన్న చనిపోయారు. చిరుద్యోగం చేస్తున్నాను. ఆస్తులేమీ లేవు. నా పెళ్లి, ఇతర బాధ్యతలతో అమ్మ కుంగిపోతోంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్ దగ్గరికి రాను, బానే ఉన్నానంటుంది. నేను కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటే ‘నువ్వెందుకు ఇవన్నీ ఆలోచిస్తావు’ అంటుంది. నేను బాగున్నట్టు నటించలేక పోతున్నా. మా అక్కను చూశాక పెళ్లంటే భయంగా ఉంది, ఇష్టంలేదంటే ఇంకా బాధపడుతోంది, కోపగించుకుంటోంది. ఇవన్నీ పడలేక చనిపోవాలనిపిస్తోంది. ఈ సమస్యనెలా పరిష్కరించుకోవాలి?
కష్టాలు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించ లేమనుకుంటే దుఃఖం. మీరు అమ్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అక్క సంసారం సంతోషంగా లేదని పెళ్లి పట్ల మీకు విముఖత. కానీ అమ్మ గురించి మీరెలా ఆలోచిస్తున్నారో మీరు స్థిరడలేదని ఆవిడ కూడా బాధపడుతుంది కదా! కుటుంబం అన్నాక పరస్పరం బాధ్యతలు తీసుకోవడం సహజం. పరిస్థితుల్ని సమర్థించుకోవాలే తప్ప చనిపోవాలనుకోవడం సరికాదు. నెగెటివ్ ఆలోచనలతో మెదడు మరింత ఒత్తిడికి గురవుతుంది. ఉద్యోగం చేస్తున్నందునే అమ్మని చూసుకోగలుగుతున్నానని గమనించండి. అందరికీ అన్నీ ఉండవు. మనం ఏర్పరచుకోవడంలో ఉంటుంది. ఆవిడ బాధ్యత తీసుకోవడానికి సుముఖంగా ఉన్న వ్యక్తిని ఎంచుకోండి. అక్క పెళ్లి సవ్యంగా లేదని అందరికీ అలాగే జరగదు. ఇలాంటి భయాలన్నీ తీసేసి మనసును నిర్మలంగా పెట్టుకోండి. ముందుగా మీకేం కావాలి, మీరేం చేయాలన్నది స్పష్టత ఉంటే భయాలూ అపోహలూ కలగవు. మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచిద్దాం అని అమ్మకి చెప్పండి. ఈలోపు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని, భయాలు పోగొట్టుకుని నిర్ణయం తీసుకోవడానికి సమయం కలిసొస్తుంది. ఇంకా అలజడిగా ఉంటే ఒకసారి కౌన్సిలింగుకు వెళ్లండి. మీకొక స్పష్టత, పరిష్కారం దొరుకుతాయి. థెరపిస్టు ధైర్యం చెప్పి, సమస్యల్ని ఎలా అధిగమించాలో సూచిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.