బాస్ వేధిస్తున్నాడు!
మా బాస్ నన్ను ప్రత్యేకంగా వేధిస్తున్నట్లు అనిపిస్తోంది. నేనో డాక్టర్‌ని. కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఒక ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తున్నా. చేరేటప్పుడే ఇంటి నుంచే పనిచేస్తానని స్పష్టంగా చెప్పా.
మా బాస్ నన్ను ప్రత్యేకంగా వేధిస్తున్నట్లు అనిపిస్తోంది. నేనో డాక్టర్‌ని. కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఒక ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తున్నా. చేరేటప్పుడే ఇంటి నుంచే పనిచేస్తానని స్పష్టంగా చెప్పా. ఆర్నెల్లుగా మా బాస్ ఆఫీసుకి వచ్చి పనిచేయాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నాడు. రోజూ ఏదో విషయంలో అవమానిస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలీడం లేదు.
- ఓ సోదరి
తిరిగి ఆఫీసుకు రావడం లేదా హైబ్రిడ్ విధానంలో పనిచేయడానికి ఒప్పించే విషయంలో వేధింపులు ఎదురవుతున్నాయని చాలా నివేదికలు చెబుతున్నాయి. వీటిపై విచారణ చేస్తున్న కమిటీ నిపుణులు - డైవర్సిటీ కన్సల్టెంట్లు, లాయర్లు వంటివారు ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంటున్నారు. 2020లో కేసుల సంఖ్య 300కుపైగా ఉంటే 2021లో 400కుపైనే! గతంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే 70 శాతం కేసులు నమోదయ్యాయి. వేధింపులు అనగానే చాలామంది లైంగికపరమైనవే అనుకుంటారు. అందులోకి రానివీ ఉన్నాయి. వాటిని నాన్ సెక్సువల్ హెరాస్‌మెంట్‌గా చెబుతాం. ఇవెలా ఉంటాయంటే... 1. తెగ, లింగం, మతం, ప్రాంతం ఆధారంగా 2. వయసు పరంగా 3. అంగవైకల్యాన్ని సూచిస్తూ 4. వ్యక్తిత్వాన్ని లేదా పరపతికి భంగం కలిగించేలా మాట్లాడటం... వంటివన్న మాట.
దీన్ని ఒక పద్ధతిలో ఎదుర్కోవాలి. దీనిపై ఫిర్యాదు చేద్దామనుకుంటున్నారా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. సమాధానం అవునయితే మీరు ఎదుర్కొన్న వాటిని నోట్‌చేసి పెట్టుకోండి. ఇలాంటి వేధింపులపై సంస్థ తీసుకునే చర్యలను ఆరా తీయండి. అయితే ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వేరే ఉద్యోగాన్నీ ముందుగానే చూసుకునుంటే పరిస్థితిని ఇంకా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మేనేజ్‌మెంట్‌తో సమస్యను చర్చించే ముందు బలమైన ఆధారాల్ని సిద్ధం చేసుకోండి. ఇలాంటివాటిని ఎదుర్కోవడం కొంచెం కష్టమే. కానీ ప్రయత్నించొచ్చు. లేబర్ లాలోనూ దీనికి సంబంధించి కొన్ని చట్టాలున్నాయి. అవసరమైతే వాటి గురించీ తెలుసుకోండి. నిర్భయంగా ఎలా ముందుకు సాగాలన్న దానిపై స్పష్టత వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.