నిర్ణయాలు మీరు తీసుకోండి...

కొందరు పెద్ద చదువులు చదివి, ఉద్యోగాల్లో స్థిరపడినా సరే.. ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంగారుపడటం, అలజడికి గురవడం చూస్తుంటాం. ఇంకొందరు భర్త చెప్పినట్లు చేయడమే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి భయపడటమూ కద్దు.

Published : 22 Jul 2022 01:45 IST

కొందరు పెద్ద చదువులు చదివి, ఉద్యోగాల్లో స్థిరపడినా సరే.. ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కంగారుపడటం, అలజడికి గురవడం చూస్తుంటాం. ఇంకొందరు భర్త చెప్పినట్లు చేయడమే తప్ప సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి భయపడటమూ కద్దు. ఆయనది మెరుగైన ఆలోచనైతే అనుసరించడం తప్పేం కాదు. కానీ మనకంటూ అభిప్రాయాలూ ఆలోచనలూ లేకుంటే ఎప్పటికీ ఆధారపడే స్థితిలోనే ఉండాలి... కనుక ఆలోచనా పరిధి పెంచుకుని, మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి.. అందుకేం చేయాలో మానసిక నిపుణులు సూచిస్తున్నారు...

* ప్రతిదీ తర్కించి చూడండి. లాభనష్టాలు బేరీజు వేయండి. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత వస్తుంది.

* క్లిష్టమైన అంశాలకు కాస్త సమయమిస్తే ఏం చేయాలో మార్గం తోస్తుంది. కాలం అన్నింటినీ పరిష్కరిస్తుందని ఊరికే అనలేదు.

* తొందరపాటు నిర్ణయాలు వద్దు. అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా, పూర్తిగా వినండి. అలాగే మీరు చెప్పేది అవతలి వాళ్లు వినేలా చేయడమూ ముఖ్యమే. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఉండాలి అనుకోవద్దు. మార్పు సహజమని గ్రహించాలి. ఆలోచనలో స్పష్టత, దాన్ని అంతే స్పష్టంగా వ్యక్తీకరించడం, అవసరమైనపుడు దృఢంగా, స్థిరంగా ఉండటం... ఇవన్నీ మీమీద మీకు నమ్మకాన్ని పెంచుతాయి. అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

* ప్రాజెక్టు విషయాలు మీరొక్కరే నిర్ణయించొద్దు. టీమ్‌ సభ్యులతో చర్చలయ్యాక ఏది ప్రయోజనకరమో స్పష్టత వస్తుంది. కొన్ని సార్లు మీ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారూ ఉంటారు. వారికి  నచ్చజెప్పగలగాలి.

* పదోన్నతి, బదిలీ లాంటివి కష్టమైన వ్యవహారాలే. అందులో మంచీ చెడులను విశ్లేషించినప్పుడు ఏది మేలో అర్థమవుతుంది. ఇంకా గందరగోళంగా ఉంటే భర్త, ఇతర సభ్యులతో చర్చించండి. అందరి అభిప్రాయాలూ విన్నాక నిర్ణయం తీసుకోండి. అది మీకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ఫలితం ఏదైనా ఇతరులను తప్పు పట్టే స్థితి రాకూడదు.

* మంచి నిర్ణయం అయినంతలో సరిపోదు. సమయానికి తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తాళం వేసితిని, గొళ్లెం మరచితిని తరహాలో వృథా ప్రయాస అవుతుందని మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్