ఈ ఒలింపిక్స్‌ ప్రత్యేకం!

టోక్యోలో పతకాల వేట సాగుతోంది. ఈ విశ్వ క్రీడాపోటీల్లో పాల్గొనడానికి వయసు అడ్డంకి కాదంటున్నారు కొందరు. మేరీ హన్నాను చూస్తే ఇదే విషయం తెలుస్తుంది..

Published : 28 Jul 2021 02:07 IST

టోక్యోలో పతకాల వేట సాగుతోంది. ఈ విశ్వ క్రీడాపోటీల్లో పాల్గొనడానికి వయసు అడ్డంకి కాదంటున్నారు కొందరు. మేరీ హన్నాను చూస్తే ఇదే విషయం తెలుస్తుంది..

మేరీ హన్నాది ఆస్ట్రేలియా. ఈక్వెస్ట్రెయిన్‌ విభాగం (గుర్రపు స్వారీ)లో పోటీ పడుతోంది. వయసు 66 ఏళ్లు. ఇప్పటికే 1996, 2000, 2004, 2012, 2016 ఒలింపిక్స్‌లో పాల్గొంది. ఈమె చిన్నప్పుడు వాళ్లకు గుర్రాలుండేవి. వాటిని సరదాగా ఎక్కుతుండేది. అలా మొదలైన ఆసక్తి నెమ్మదిగా పోటీల దాకా తీసుకొచ్చింది.  30వ ఏటనుంచి వెన్నునొప్పి వెంటాడుతున్నా సర్జరీ చేయించుకుని మరీ కొనసాగిస్తోంది. ఒలింపిక్‌ చరిత్రలో అతిపెద్ద వయసు మహిళల్లో ఈమెది రెండో స్థానం. మేరీ.. గత ఏడాది ఈ క్రీడలో 80 శాతం స్కోరు సాధించిన తొలి ఆస్ట్రేలియన్‌ మహిళగా గుర్తింపుతోపాటు టోక్యోకి అర్హతనూ సాధించింది. ఈసారి పతకంతోపాటు భవిష్యత్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనడమూ తన కలగా చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్