ఇలా చేస్తే.. రోజూ ప్రత్యేకమే!
భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా మాట తేడా వస్తే రావచ్చు గాక. అయినా.. వాళ్లే ఒకరికొకరు తోడూనీడా. ఆ ప్రేమ ఇంకిపోకుండా జీవనపర్యంతం జీవనదిలా ప్రవహించాలంటే ఈ సూత్రాలు పాటించండి..
భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా మాట తేడా వస్తే రావచ్చు గాక. అయినా.. వాళ్లే ఒకరికొకరు తోడూనీడా. ఆ ప్రేమ ఇంకిపోకుండా జీవనపర్యంతం జీవనదిలా ప్రవహించాలంటే ఈ సూత్రాలు పాటించండి..
* గాలి, నీరు, ఆహారాల్లాగే ప్రేమ కూడా కనీస అవసరం. అనుక్షణం మనల్ని ఇష్టపడే వ్యక్తి ఉన్నారనుకుంటే అదే పెద్ద సంతోషం, సంతృప్తి. భార్య వంటపనులతో హడావుడిగా ఉందిలెమ్మని భర్త.. అతను టీవీ చూస్తూ లేదా బయటికెళ్లే తొందరలో ఉన్నాడని ఆమె ఒకర్నొకరు గంటల తరబడి పలకరించుకోకపోతే ఒకే ఇంట్లో ఉన్నా దగ్గరితనం కోల్పోతారు. ఒకరి ఉనికిని ఒకరు గుర్తించనట్టుగా, పట్టనట్టుగా ఉంటే అది ఒకరకంగా ప్రేమరాహిత్యమే. అందుకు పైకి ఆరోపణలూ నిందలూ చేయకపోవచ్చు. కానీ ఆ బంధం ఆత్మీయత తగ్గి ఉప్పు లేని కూరలా ఉంటుంది.
* ఒకరి ఇష్టాల్ని మరొకరు గుర్తుంచుకుని గౌరవించడం వల్ల ఇద్దరి మధ్యా ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. ‘దానిమ్మకాయల సీజన్ కాకున్నా నీకిష్టమని వెతికి తెచ్చానోయ్’ అని భర్త అంటే అది ఖరీదైంది కాకున్నా ఆ ప్రేమకు కరిగిపోతుంది. ‘బిగ్గరగా అరిస్తే నాన్నకు నచ్చదని తెలీదా? చిన్నగా మాట్లాడు తల్లీ’ అని కూతురితో అంటే తన ఇష్టాయిష్టాలను గౌరవించే భార్యామణి మీద అభిమానం పెరిగిపోతుందతడికి.
* పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటివి ఏడాదికి ఒక్కసారే వస్తాయి. కానీ మనసుంటే ప్రతిరోజూ ప్రత్యేకమైనదే. చిన్న చిన్న కానుకలు ఇవ్వడానికీ లేదా అవతలి వ్యక్తిని ఆనందింపచేసేలా సినిమాలూ, షికార్లు ప్లాన్ చేయడానికీ ఆ రోజుల కోసం పడిగాపులు పడనవసరం లేదు. సందర్భాన్ని కల్పించుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. భార్యాభర్తలు అప్పుడప్పుడూ కానుకలు ఇచ్చిపుచ్చుకుంటే ఆనందాలూ, అనుభూతులూ సొంతమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
ఆరోగ్యమస్తు
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
- ఏకాగ్రతను పెంచే బంతాట
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- అన్నీ తినాలి మరి!
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
యూత్ కార్నర్
- వీగన్ ఉత్పత్తులతో... రూ.830 కోట్ల వ్యాపారం!
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
'స్వీట్' హోం
- మొక్కలు... సురక్షితమిలా!
- టైల్స్ మధ్య మురికి.. పోవాలంటే!
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
వర్క్ & లైఫ్
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!
- ఈ జుగుప్స ఎందుకు?
- ఆ మౌనానికి కారణం తెలుసా!
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!