డైపర్‌ను కనిపెట్టిందీ అమ్మ!

బిడ్డ ఆకలితో ఏడుస్తోందా.. అజీర్తితోనా? మరేదైనా కారణమా అన్నది అమ్మకు ఇట్టే తెలిసిపోతుంది. బిడ్డకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఆమె మనసు విలవిలలాడుతుంది. డోనోవన్‌ కూడా అంతే. మాటిమాటికీ తడిసే లంగోటా తన పాపాయికి ఇబ్బంది కలిగించడం గమనించారు. దాన్ని దూరం చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నమే ఇప్పుడు మన పిల్లలకు వాడుతున్న డైపర్‌. దీని తయారీకి ఆమె షవర్‌ కర్టెన్‌ను ఎంచుకున్నారు. దానికి అడుగున చుట్టూ పాస్టిక్‌ కాగితాన్ని కలుపుతూ రూపొందించి, దానికి

Updated : 04 Mar 2022 06:40 IST

మీకు తెలుసా!

బిడ్డ ఆకలితో ఏడుస్తోందా.. అజీర్తితోనా? మరేదైనా కారణమా అన్నది అమ్మకు ఇట్టే తెలిసిపోతుంది. బిడ్డకు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఆమె మనసు విలవిలలాడుతుంది. డోనోవన్‌ కూడా అంతే. మాటిమాటికీ తడిసే లంగోటా తన పాపాయికి ఇబ్బంది కలిగించడం గమనించారు. దాన్ని దూరం చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నమే ఇప్పుడు మన పిల్లలకు వాడుతున్న డైపర్‌. దీని తయారీకి ఆమె షవర్‌ కర్టెన్‌ను ఎంచుకున్నారు. దానికి అడుగున చుట్టూ పాస్టిక్‌ కాగితాన్ని కలుపుతూ రూపొందించి, దానికి బోటర్‌ అని పేరు పెట్టారు. డోనోవన్‌ది అమెరికా. పూర్తిపేరు.. మరియన్‌ ఓ బ్రియన్‌ డోనోవన్‌. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. నాన్న ఇంజినీర్‌. ఆయన్ని చూస్తూ పెరిగిన డోనోవన్‌కీ ఆవిష్కరణల పట్ల మక్కువ ఏర్పడింది. బాల్యంలోనే తండ్రి సాయంతో కొత్త రకం పళ్ల పొడిని కనుక్కున్నారామె. యేల్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్‌ పూర్తి చేశారు. ప్రముఖ పత్రికల్లో బ్యూటీ ఎడిటర్‌గా పనిచేశారు. వ్యాపారవేత్త కూడా. ఆమె ఆవిష్కరణల్లో దాదాపు 20 పేటెంట్‌ హక్కులు పొందారు కూడా. పునర్వినియోగించే లీక్‌ ప్రూఫ్‌, వాటర్‌ ప్రూఫ్‌ డైపర్‌ను ఆమె పరిశోధనల్లో ఉత్తమమైందిగా చెప్పొచ్చు. దీన్ని ఆమె 1946లో తయారుచేశారు. ఇదే తర్వాత డిస్పోజబుల్‌ పేపర్‌ డైపర్‌ కనిపెట్టడానికి దారి తీసింది. ప్యాంపర్స్‌ (డైపర్స్‌) సృష్టికర్త విక్టర్‌ మిల్స్‌ దీన్ని వాణిజ్యీకరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్