గెలిచి.. గెలిపించాలనుకుంటోంది

ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు ఓయినం బెమ్‌బెమ్‌ దేవి. ఈ విభాగంలో ఆ ఘనత సాధించిన తొలి మహిళ తనే. ప్రపంచ పోటీల్లో విజేతగా నిలిచి దేశం గర్వపడేలా పలు అవార్డులను దక్కించుకున్న ఈమె..

Updated : 30 Sep 2022 14:29 IST

మొదటి ఘనత

ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు ఓయినం బెమ్‌బెమ్‌ దేవి. ఈ విభాగంలో ఆ ఘనత సాధించిన తొలి మహిళ తనే. ప్రపంచ పోటీల్లో విజేతగా నిలిచి దేశం గర్వపడేలా పలు అవార్డులను దక్కించుకున్న ఈమె.. శిక్షకురాలిగా మారి మరో తరాన్ని గెలుపు దిశగా నడిపిస్తున్నారు.

బెమ్‌బెమ్‌కి బాల్యం నుంచే క్రీడలంటే మక్కువ. మగపిల్లలతో పోటీపడి ఫుట్‌బాల్‌ ఆడే వారు. ఈమెది ఇంఫాల్‌. తనకు పదేళ్లున్నప్పుడు ఇంఫాల్‌ యునైటెెడ్‌ పయొనీర్స్‌ క్లబ్‌లో శిక్షణకు చేరారు. ఆ వయసులోనే ఆమె బంతిని తన్నే వేగానికి అందరూ ఆశ్చర్యపోయే వారు. నేర్చుకోవడం మొదలుపెట్టిన మూడేళ్లకే మణిపుర్‌ తరఫున సబ్‌ జూనియర్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్లో అండర్‌-13 టీంకు నేతృత్వం వహించారీమె. 15 ఏళ్లకే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే కాదు ఆసియన్‌ విమెన్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. మణిపుర్‌ రాష్ట్ర ఫుట్‌బాల్‌ తరఫున హైదరాబాద్‌లో నిర్వహించిన 32వ నేషనల్‌ గేమ్స్‌లో జట్టుకు నేతృత్వం వహించి విజేతగానూ నిలబెట్టారు. ఎన్నో టోర్నమెంట్స్‌లో టాప్‌ స్కోరర్‌ కూడా. సౌత్‌ ఆసియన్‌ గేమ్స్‌, 2010, 12 ఎస్‌ఏఎఫ్‌ఎఫ్‌ విమెన్స్‌ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిపారు. ఇండియన్‌ విమెన్స్‌ లీగ్‌కు బాధ్యత వహించిన తొలి మహిళా మేనేజరు. 2018లో అండర్‌17 మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు సహాయక శిక్షకురాలిగా ఉన్నారు. నేటి తరానికి ఈ క్రీడపై మరింత ఆసక్తిని పెంచాలని అవగాహనా కార్యక్రమాలు చేపడుతూ, ఆసక్తి ఉన్న వారికి శిక్షణనూ అందిస్తున్నారు. ఈమెకు‘దుర్గా ఆఫ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌’గా పేరు. ‘ఏఐఎఫ్‌ఎఫ్‌ విమెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా రెండుసార్లు, 2017లో ‘అర్జున’, 2020లో ‘పద్మశ్రీ’ అవార్డులు ఈమెను వరించాయి. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా తొలి పద్మశ్రీ అవార్డు అందుకున్న భారతీయురాలిగా నిలిచిన ఈమె, తనకు పురస్కారాలు, గౌరవాలన్నీ నేటి తరం అమ్మాయిలకే అంకితం అంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్