నిర్ణయించను.. తోడుంటా!

అందరికీ నేను సెలబ్రిటీనేమో.. కానీ నా కూతురికి అమ్మనే! పని కూడా ముఖ్యమే అయినా నా మొదటి ప్రాధాన్యం ఆరాధ్యకే. తన సంరక్షణ బాధ్యతని ఎవరికీ అప్పగించను.

Updated : 12 Nov 2022 04:35 IST

అందరికీ నేను సెలబ్రిటీనేమో.. కానీ నా కూతురికి అమ్మనే! పని కూడా ముఖ్యమే అయినా నా మొదటి ప్రాధాన్యం ఆరాధ్యకే. తన సంరక్షణ బాధ్యతని ఎవరికీ అప్పగించను. స్కూలుకు తీసుకెళ్లడం, తీసుకురావడం వంటివి నేనే చూసుకుంటా. తనకో అందమైన బాల్యమివ్వాలి. అందులో ముఖ్యంగా అమ్మ తోడు తనకివ్వాలనుకుంటా. అందుకే ఒక్కోసారి పనిపరంగా విదేశాలకు వెళ్లినా తను నా వెంట ఉండాల్సిందే. ఈ విషయంలో ఎంత ట్రోలింగ్‌ వచ్చినా పట్టించుకోను. నా కూతురికి ఏ సమయంలో అవసరమున్నా నేను అందుబాటులో ఉండాలి. సందేహాలు తీర్చాలి, ధైర్యాన్నివ్వాలి. అలాగని ఇలా చెయ్యి, ఇలాగే ఉండు అని నిర్ణయించను, శాసించను. తను ఎంచుకునే మార్గంలో ధైర్యంగా సాగడానికి అవసరమైన సలహాలు మాత్రమే ఇస్తా. నా ఏకైక లక్ష్యం తను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి, కోరుకున్న రంగంలో విజయం సాధించాలి. ఆ క్రమంలో ఎదురయ్యే అవరోధాలు ఎదుర్కొనేంత దృఢంగా అయ్యే వరకూ తనకు తోడుగా ఉంటా. ఆ స్థాయికి తను చేరుకునే వరకూ నేను తన చేయి వదిలేది లేదు.

- ఐశ్వర్య రాయ్‌, నటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని