చంద్రుడిపైకి క్రిస్టినా...

మహిళలను ఇప్పటివరకూ వరించని అవకాశం వ్యోమగామి క్రిస్టినా కోచ్‌కు దక్కింది. చంద్రుడిపై త్వరలో కాలుమోపనున్న బృందంలో ఈమె స్థానాన్ని సంపాదించారు.

Published : 05 Apr 2023 00:03 IST

తొలి అడుగు

మహిళలను ఇప్పటివరకూ వరించని అవకాశం వ్యోమగామి క్రిస్టినా కోచ్‌కు దక్కింది. చంద్రుడిపై త్వరలో కాలుమోపనున్న బృందంలో ఈమె స్థానాన్ని సంపాదించారు. అక్కడ నిర్వహించనున్న 10 రోజుల ప్రత్యేక మిషన్‌కు స్పెషలిస్ట్‌గానూ క్రిస్టినా వ్యవహరించనున్నట్లు నాసా ప్రకటించింది. చందమామపైకి అడుగుపెట్టనున్న తొలి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించనున్న క్రిస్టినా గతంలోనూ మరెన్నో రికార్డులూ సాధించారు.

మెరికాకు చెందిన క్రిస్టినా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. నార్త్‌ కరోలినా స్టేట్‌ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ అందుకొని.. 2013లో నాసాలో చేరారీమె. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)కు ఫ్లైట్‌ ఇంజినీర్‌గా సేవలందించారు. వ్యోమగామిగా పలు రికార్డులూ సాధించారు. అంతరిక్షంలో 328 రోజులుండి, అత్యధిక కాలం అక్కడ గడిపిన మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. 2019 అక్టోబరులో తొలి ‘ఆల్‌ ఫిమేల్‌ స్పేస్‌వాక్‌’ రికార్డుసహా మొత్తం ఆరుసార్లు స్పేస్‌వాక్‌ చేశారీమె. అంతరిక్షనౌకకు బయట 42.15 గంటలపాటు గడిపారు. స్పేస్‌లో పలు అంశాలపై ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టారు.  వృక్షశాస్త్రంపై అధ్యయనం చేసి స్పేస్‌లో ఆకుకూరలను పండించి చూపించారు. ‘నాసా మిషన్‌లో అవకాశాన్నిస్తూ నా పేరు ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నా. ఇదొక అద్భుతమైన ప్రయాణం కానుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, వేగవంతమైన రాకెట్‌లో లక్షల మైళ్లదూరం ప్రయాణించి చందమామను చేరుకుంటాం. మాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఉత్సాహం, ఆకాంక్ష, కలలనీ అక్కడికి మోసుకెళతాం’ అంటున్నారు 44ఏళ్ల క్రిస్టినా కోచ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్