యుద్ధనేలలో... చిగురించిన ఆశ

బాంబుల మోతలు... తుపాకీ గుళ్ల చప్పుళ్లు. నిత్యం యుద్ధమేఘాలు అలుముకొన్న సిరియా వంటి చోట్ల ‘సమానత్వం’, ‘స్త్రీల హక్కులు’ అనే మాటల్ని వినగలమా? కానీ జిన్వార్‌లో వినబడతాయి. అది దగాపడ్డ మహిళలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక ఊరు.

Updated : 16 Mar 2024 15:18 IST

మహిళా లోకం

బాంబుల మోతలు... తుపాకీ గుళ్ల చప్పుళ్లు. నిత్యం యుద్ధమేఘాలు అలుముకొన్న సిరియా వంటి చోట్ల ‘సమానత్వం’, ‘స్త్రీల హక్కులు’ అనే మాటల్ని వినగలమా? కానీ జిన్వార్‌లో వినబడతాయి. అది దగాపడ్డ మహిళలంతా కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక ఊరు. 50 భవంతులున్న ఈ ఊళ్లో.. గృహహింసకు గురైనవాళ్లు, చావు అంచుల వరకూ వెళ్లిన వాళ్లూ, యుద్ధంలో భర్తల్ని కోల్పోయిన వాళ్లూ ఉంటారు. ఇక్కడ పిల్లల కోసం స్కూలు, స్త్రీల హక్కుల్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఒక లైబ్రరీ, బేకరీ, ఆరోగ్య కేంద్రం ఉంటాయి. అన్నింటికీ మించి జిన్వార్‌ అకాడమీ గురించి చెప్పుకోవాలి. ఈ అకాడమీలో మహిళలు ఒకరికి తెలిసిన విద్యను మరొకరికి నేర్పుతారు. ముఖ్యంగా స్థానికంగా లభించే మొక్కల నుంచి ఆర్గానిక్‌ కాస్మెటిక్స్‌, ఔషధాల తయారీని ఇక్కడ నేర్పిస్తారు. ఆంక్షల మధ్యన నలిగిపోతున్న ఇతర ఆడవాళ్లూ తమ నుంచి స్ఫూర్తి పొందాలనుకుంటున్నారు జిన్వార్‌ మహిళలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్