గర్భిణులకు ఔషధం కివీ పండు

మనలో చాలామందిమి ఆకలి తీరడానికి ఏదో తింటాం. అందులో సరైన పోషకపదార్థాలు లేక బలహీనత చోటుచేసుకుంటుంది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఇక చెప్పాల్సిందేముంది.. నీరసంగా ఉంటుంది. కానీ ఇంటిల్లిపాదినీ కనిపెట్టుకుని ఉండే ఇల్లాలు నిస్సత్తువగా ఉంటే కుదరదు కదా!

Updated : 26 Jan 2022 04:20 IST

మనలో చాలామందిమి ఆకలి తీరడానికి ఏదో తింటాం. అందులో సరైన పోషకపదార్థాలు లేక బలహీనత చోటుచేసుకుంటుంది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఇక చెప్పాల్సిందేముంది.. నీరసంగా ఉంటుంది. కానీ ఇంటిల్లిపాదినీ కనిపెట్టుకుని ఉండే ఇల్లాలు నిస్సత్తువగా ఉంటే కుదరదు కదా! మరి ఇలాంటి పరిస్థితిని వేగంగా పరిష్కరించుకోవాలంటే కివీస్‌ తినాల్సిందే! ఈ పండ్లతో ఇంకెన్ని లాభాలో మీరే చూడండి...

* కివీ పండ్లు తినడం వల్ల జీర్ణప్రక్రియ సవ్యంగా ఉంటుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. కడుపులో మంట రాకుండా చేస్తాయి. వీటిలో అధిక కెలొరీలు, పీచుపదార్థం ఉన్నందున వెంటనే కడుపు నిండిన భావం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కివీ పండ్లు ఉత్తమం.
* కివీస్‌లో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున ఆరోగ్యానికి మంచిది. ఈ పండ్లను తరచుగా తినడంవల్ల దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పడతాయి. వీటిలో అధికంగా ఉండే సి-విటమిన్‌ జలుబు, ఉబ్బసం లాంటి శ్వాస ఇబ్బందులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
* వీటిల్లో ఉండే మంచి కొలెస్ట్రాల్‌ గుండెకు ఎంతో మంచిది. రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గనీయవు. మలబద్ధక సమస్యను నివారిస్తాయి. అనేక రకాల క్యాన్సర్‌లను నిరోధిస్తాయి. ఈ పండ్లు దొరికే సీజన్‌లో రోజూ ఒక కివీ పండు తినమంటున్నారు డాక్టర్లు.
* గర్భిణులు ఈ పండ్లు తినడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా మెదడు, వెన్నెముకలు దృఢంగా తయారవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్