కసరత్తులకు కాదేదీ అనర్హం

‘ఛ.. ఎక్సర్‌సైజ్‌ చేద్దామంటే జిమ్‌లు తెరిచి లేవు’- గత ఏడాదిగా చాలామంది నోటి నుంచి ఈ మాట వినుంటాం. కానీ చేయాలన్న కోరికుండాలే గానీ.. ఇంట్లోని ప్రతి వస్తువూ వ్యాయామ పరికరమే

Published : 13 Jun 2021 02:06 IST

‘ఛ.. ఎక్సర్‌సైజ్‌ చేద్దామంటే జిమ్‌లు తెరిచి లేవు’- గత ఏడాదిగా చాలామంది నోటి నుంచి ఈ మాట వినుంటాం. కానీ చేయాలన్న కోరికుండాలే గానీ.. ఇంట్లోని ప్రతి వస్తువూ వ్యాయామ పరికరమే అంటున్నారు నిపుణులు. సందేహంగా ఉంటే చదివేయండి.

* టేబుల్‌: రెండు సమాన ఎత్తున్న టేబుళ్లను తీసుకోవాలి. ఒకదాని మీద కూర్చుని, రెండోదానిమీద కాళ్లను ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను ఆధారంగా చేసుకుని శరీరాన్ని పైకి లేపాలి. బ్యాలెన్స్‌ చేసుకుంటూనే ఒక కాలిని నిటారుగా లేపాలి. నెమ్మదిగా దింపాలి. ఇప్పుడు రెండోదాన్నీ అలాగే చేయాలి. ఒక్కో కాలిని మారుస్తూ 10 వరకూ చేయొచ్చు.

* కుర్చీ: తక్కువ ఎత్తున్న కుర్చీని తీసుకోవాలి. చేతులకు దాన్ని అదునుగా చేసుకోవాలి, కాళ్లని నేల మీద ఉంచి మౌంట్‌  క్లైంబింగ్‌ చేయాలి. పరుగెత్తే వీలు లేదనుకున్నవారు దీన్ని ప్రయత్నించవచ్చు. గుండె ఆరోగ్యానికి బాగా పనికొస్తుంది.

బ్యాక్‌ ప్యాక్‌: మోయగలిగినంత బరువుతో బ్యాక్‌ప్యాక్‌ను నింపి, వెనుక తగిలించుకోవాలి. ఆపై ప్లాంక్‌ (చేతులు, కాళ్లు మునివేళ్లపై పూర్తి శరీరాన్ని బ్యాలెన్స్‌ చేయడం)ను వీలైనంత సమయంపాటు ప్రయత్నించండి. పొట్ట కండరాలను బలంగా చేస్తుందిది.

* దిండు: రెండు చేతులతో దిండును పట్టుకుని కూర్చుని, లేవడం చేయాలి. భుజాలు, కాళ్లకి మంచి వ్యాయామమిది.

* వాటర్‌ బాటిల్‌: నేల మీద కూర్చుని కాళ్లను వంచుతున్నట్టుగా పైకి లేపి ఉంచాలి. సైక్లింగ్‌ చేస్తూ నీటితో నింపిన వాటర్‌ బాటిల్‌ను రెండు చేతులతో పట్టుకుని రెండు పక్కలా ట్విస్ట్‌ చేయాలి. పూర్తి శరీరానికి వ్యాయామమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్