Health: శ్వాసకు మేలు చేస్తాయి!

కరోనా సెకెండ్‌వేవ్‌లో 60 నుంచి 65 శాతంమంది ప్రాణవాయువు అందక విలవిల్లాడుతున్నట్టు, రెండుమూడు రోజుల్లోనే ఆక్సిజన్‌ 80కంటే పడిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో

Updated : 20 Jun 2021 10:08 IST

కరోనా సెకెండ్‌వేవ్‌లో 60 నుంచి 65 శాతంమంది ప్రాణవాయువు అందక విలవిల్లాడుతున్నట్టు, రెండుమూడు రోజుల్లోనే ఆక్సిజన్‌ 80కంటే పడిపోతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దని, వ్యయప్రయాసల్లేకుండా ఇంట్లోనే లభ్యమయ్యే ఆహారాలతో దృఢంగా ఉంచుకోమని సూచిస్తున్నారు ఆహారనిపుణులు. అవేంటో చూద్దామా...

పసుపు: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (తాపజనక) గుణాలు అధికంగా ఉండి ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. ఇన్‌ఫెక్షన్ల బారినుంచి కాపాడుతుంది. రాత్రి పడుకునేముందు గోరువెచ్చటి పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగండి. అలాగే పసుపు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం, తులసి ఆకులతో కషాయం కాచుకుని తాగండి. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

తులసి: పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, సి విటమిన్‌, కెరోటిన్‌లు అధికంగా ఉండే తులసి ఆకులు ఊపిరితిత్తులకు మేలుచేస్తాయి. రోజుకు నాలుగైదు తులసి ఆకులు తినండి లేదా కషాయం చేసుకుని తాగండి.

అంజీరా: ఇందులో విటమిన్‌ ఎ,సి,కె లు, పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌, ఐరన్‌లు విస్తారంగా ఉన్నందున ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్