మలంతో పాటు రక్తం పడుతోంది.. ఎందుకిలా?

హలో డాక్టర్‌. నా వయసు 29. బరువు 61. ఎత్తు 5’2’’. నాకు ఈ మధ్య మలంతో పాటే కాస్త రక్తం కూడా బయటికి వస్తోంది. రోజుకు మూడునాలుగు సార్లు మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఇదేమైనా సమస్యా? ఎందుకిలా అవుతోంది?  దయచేసి చెప్పండి.

Published : 24 Oct 2021 12:02 IST

హలో డాక్టర్‌. నా వయసు 29. బరువు 61. ఎత్తు 5’2’’. నాకు ఈ మధ్య మలంతో పాటే కాస్త రక్తం కూడా బయటికి వస్తోంది. రోజుకు మూడునాలుగు సార్లు మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఇదేమైనా సమస్యా? ఎందుకిలా అవుతోంది?  దయచేసి చెప్పండి.

- ఓ సోదరి

జ: మలంతో పాటు రక్తం వస్తోందంటే అందుకు వివిధ కారణాలుండచ్చు. అయితే మీకు మలంతో పాటు రక్తం కలిసిపోయి వస్తోందా? లేదంటే మల విసర్జన అయిపోయాక చివర్లో బొట్లుగా పడుతోందా? అలాగే మల విసర్జన సమయంలో విపరీతమైన నొప్పేమైనా ఉంటుందా? అన్నది తెలియడం ముఖ్యం. ఇందుకు సాధారణమైన కారణాలు.. పైల్స్‌, ఫిషర్‌! అయితే అసలు కారణమేంటో తెలుసుకోవాలంటే ఒకసారి సర్జన్‌తో పరీక్ష చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి వారు ప్రాక్టోస్కోపీ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, కొలనోస్కోపీ.. వంటి పరీక్షలు చేస్తారు. మీ సమస్యను బట్టే చికిత్స ఉంటుంది. అలాగే మలబద్ధకం లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్