Summer Food: బార్లీ నీళ్లు.. ఎందుకు మంచివో తెలుసా?

పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే..

Published : 22 Mar 2024 11:49 IST

పోషకాలు అందించే బార్లీ వేసవికి సహజసిద్ధమైన ఔషధం లాంటిది. శరీరంలోని వేడిని తగ్గించి, తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందంటే..

బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి.. వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది బార్లీ.

ఈ గింజలు హృద్రోగాలను దరి చేరనివ్వవు. అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు.. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగిస్తుంది. మూత్ర సంబంధ సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.

బార్లీ నీటికి మజ్జిగ, నిమ్మరసం, తేనె, నారింజ రసాన్ని కలుపుకొని తాగితే.. రుచిగా ఉండడమే కాదు.. వేసవిలో శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

బార్లీని లేత గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకొని, పొడి చేసుకోవాలి. మూడు కప్పుల నీటిని పొయ్యి మీద పెట్టి మరిగించాలి. అలాగే రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి. మరిగిన నీటిలో ఈ మిశ్రమాన్ని కలపాలి. పది నిమిషాలు ఉడికించి చల్లార్చి వడకట్టుకోవాలి. ఈ నీటికి పావు గ్లాసు పల్చని మజ్జిగ, చిటికెడు ఉప్పు కలిపి ఈ వేసవిలో తరచూ తాగితే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్