పిల్లల్లో చర్మం పొడిబారకూడదంటే ఏం చేయాలి?

మేడం.. పిల్లల్లో చర్మం పొడిబారే సమస్య (Dry Skin Problem) తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చెబుతారా? - ఓ సోదరి

Published : 26 Dec 2021 13:29 IST

మేడం.. పిల్లల్లో చర్మం పొడిబారే సమస్య (Dry Skin Problem) తగ్గాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో చెబుతారా? - ఓ సోదరి

జ. పిల్లలంటే ఏ వయసు పిల్లలకు అనేది మీరు రాయలేదు. సాధారణంగా నెలల వయసున్న పిల్లలకైతే పాల మీగడ, వెన్న.. వంటివి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అలాగే ఐదేళ్లు దాటిన పిల్లలైతే బాదం నూనె రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను చర్మానికి రాసుకుంటే అది చర్మంలోకి బాగా ఇంకిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు కూడా గ్లిజరిన్‌ ఆధారిత సబ్బుల్ని ఉపయోగిస్తే మరీ మంచిది. తద్వారా చర్మం పొడిబారే సమస్యను తగ్గించుకోవడంతో పాటు మేను మెరుపును సంతరించుకుంటుంది. ఐదేళ్ల పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా ఈ చిట్కాను పాటించచ్చు. అలాగే ముందు నుంచీ ఈ నూనె ఉపయోగిస్తున్నట్లయితే శీతాకాలంలో చర్మం పొడిబారే సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్