మళ్లీ పాజిటివ్ మూడ్‌లోకి.. ఇలా!

ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా.. ప్రతికూల ఆలోచనలు మనసుని వేధిస్తుంటాయి. అనారోగ్యం.. ఇంట్లోనో.. ఉద్యోగంలోనో సమస్యలు.. కారణాలు ఏవైనా.. ఎక్కువ రోజులు ఇవే ఆలోచనలతో కాలం గడపడం మంచిది కాదు.. అందుకే మనసు బాలేనప్పుడు మళ్లీ కాస్త పాజిటివ్ మూడ్‌లోకి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.

Published : 10 Aug 2023 21:08 IST

ఒక్కోసారి ఎంత వద్దనుకున్నా.. ప్రతికూల ఆలోచనలు మనసుని వేధిస్తుంటాయి. అనారోగ్యం.. ఇంట్లోనో.. ఉద్యోగంలోనో సమస్యలు.. కారణాలు ఏవైనా.. ఎక్కువ రోజులు ఇవే ఆలోచనలతో కాలం గడపడం మంచిది కాదు.. అందుకే మనసు బాలేనప్పుడు మళ్లీ కాస్త పాజిటివ్ మూడ్‌లోకి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.

నెగెటివ్ థింకింగ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పాట వినడమో, పాడడమో చేయండి. మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చే అవకాశాలుంటాయి.

మీరు ఉన్న ప్రదేశం నుంచి బయటకు వచ్చి కాసేపు అటూఇటూ నడవండి. ఈ సమయంలో మీకు బాగా నచ్చిన అంశాల గురించి ఆలోచించడానికి ప్రాధాన్యం ఇచ్చి చూడండి.

మీకు బాగా ఇష్టమైన అభిరుచి ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకొని దానిపై దృష్టి పెట్టి చూడండి. అసలు ప్రతికూలంగా ఆలోచించే సమయం కూడా ఉండదంటే అతిశయోక్తి కాదేమో!

ప్రతి విషయంలోనూ సాధ్యమైనంత మేరకు సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, పాజిటివ్‌గా ఆలోచించండి.

ఎంత నియంత్రించుకుందామని ప్రయత్నించినా నెగెటివ్ ఆలోచనలు అస్సలు ఆగట్లేదా? అయితే ముందుగా మీ మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి కొద్ది నిమిషాల పాటు ధ్యానం లేదా శ్వాస మీద ధ్యాస పెట్టడం వంటివి చేయండి. ఆ తర్వాత పాజిటివిటీని పెంచే కొటేషన్స్ చదవండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

వేధించే ఆలోచనల నుంచి బయటకు రావాలంటే మనసు దృష్టి మళ్లించే మరో పని ఏదో ఒకటి చేయాలి. ఈ క్రమంలోనే ఇతరులకు సహాయం చేయడం, సమాజ సేవలో పాల్గొనడం.. వంటివి చేసి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్