మార్పు అవసరం...

‘ఉదయాన్నే నిద్రలేవడం, ఉద్యోగానికి వెళ్లడం, నిద్రపోవడం...మళ్లీ లేవడం’ దినచర్య ఇలానే ఉంటే విసుగెందుకు రాదు... అందుకే కొన్ని మార్పులు చేసుకుని చూడండి.....

Updated : 08 Dec 2022 19:12 IST

‘ఉదయాన్నే నిద్రలేవడం, ఉద్యోగానికి వెళ్లడం, నిద్రపోవడం...మళ్లీ లేవడం’ దినచర్య ఇలానే ఉంటే విసుగెందుకు రాదు... అందుకే కొన్ని మార్పులు చేసుకుని చూడండి.

* చదువుకునే రోజుల్లో కొన్ని ఆసక్తులుంటాయి. అవి డ్యాన్స్‌, పాటలూ ఏవైనా కావొచ్చు. కానీ పెళ్లయ్యాక అన్నీ వదిలేస్తాం. అప్పుడే విసుగొస్తుంది. తిరిగి ఉత్తేజం పొందాలంటే పనిచేస్తూనే ఓ రాగం తీయడం, కాలు కదపడం తప్పేంకాదు.
* చాలామందికి వంటలు చేయడమన్నా, దాంట్లో ప్రయోగాలు చేయడమన్నా ఇష్టం ఉంటుంది. కానీ, ఉద్యోగంలో చేరాక ఏదో ఒకటి చేసేద్దాంలే అనే ఆలోచన మొదలవుతుంది. ఆ ఆసక్తి పోకుండా ఉండాలంటే వారానికోసారైనా వంటగదిలో ప్రయోగాలు చేయగలిగితే ఎంతో సంతృప్తి.
* రోజూ కాసేపు పచ్చని మొక్కలకోసం సమయం కేటాయించండి. దానివల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఏదో పెద్ద పెరడు ఉండాలని కాదు... వంటగది కిటికీలోనో, ఆరుబయట హ్యాంగింగ్‌ పాట్స్‌లోనో రెండు మొక్కలు పెంచుకున్నా చాలు. వాటి పెంపకం విషయంలో మాత్రం శ్రద్ధ చూపండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్