వీటితో క్షణాల్లో ఫ్రూట్ జ్యూస్ రడీ!

ఎండలు మండిపోతున్నాయి.. డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవాలంటే నీళ్లతో పాటు చల్లని మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాల్సిందే. అయితే జ్యూసుల దగ్గరికొచ్చేసరికి తాగడం వరకు బాగానే ఉంటుంది.. కానీ వాటిని తయారుచేయడమే పెద్ద పనిగా ఫీలవుతుంటారు చాలామంది. ఈ క్రమంలో పెద్దగా శ్రమ అవసరం.......

Published : 08 Apr 2022 20:14 IST

ఎండలు మండిపోతున్నాయి.. డీహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవాలంటే నీళ్లతో పాటు చల్లని మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాల్సిందే. అయితే జ్యూసుల దగ్గరికొచ్చేసరికి తాగడం వరకు బాగానే ఉంటుంది.. కానీ వాటిని తయారుచేయడమే పెద్ద పనిగా ఫీలవుతుంటారు చాలామంది. ఈ క్రమంలో పెద్దగా శ్రమ అవసరం లేకుండా సులభంగా, ఎప్పటికప్పుడు తాజాగా జ్యూస్ తయారుచేసుకోవాలంటే ‘మినీ హ్యాండీ జ్యూసర్స్’ ఉండాల్సిందే! వీటితో చిటికెలో పండ్ల రసాలు తయారుచేసుకోవచ్చు. పైగా శుభ్రం చేయడం కూడా సులువే! మరి, అలాంటి కొన్ని మినీ జ్యూసర్స్ గురించి తెలుసుకుందాం రండి..

మ్యాన్యువల్‌ జ్యూసర్‌ విత్‌ స్ట్రెయినర్

విటమిన్ ‘సి’ అధికంగా లభించే బత్తాయి, కమలా పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. అయితే వీటిని నేరుగా కంటే రసం చేసుకొని తీసుకునే వారే ఎక్కువ. అలాగని ఈ పండుని బ్లెండర్‌లో వేయలేం.. పైగా ఆరెంజ్‌ ప్రెసర్‌తో రసం తీయడం కాస్త కష్టమైన పనే! మరి, ఈ శ్రమంతా వద్దనుకునే వారు ‘మ్యాన్యువల్‌ జ్యూసర్‌ విత్‌ స్ట్రెయినర్‌’ని ఎంచుకుంటే సరిపోతుంది.

చూడ్డానికి ఫ్లాస్క్‌ బాటిల్‌ మాదిరిగా ఉండే దీనికి కింద చిన్న కంటెయినర్‌, మధ్యలో స్క్వీజర్‌, పై భాగంలో మూత అమరి ఉంటాయి. ఇప్పుడు కట్‌ చేసిన కమలా/బత్తాయి పండు ముక్కను స్క్వీజర్‌పై బోర్లించి.. మూతను టైట్‌ చేస్తుంటే రసం కింద ఉన్న కంటెయినర్‌లో పడుతుంది. ఇలా కంటెయినర్‌ నిండేంత వరకు జ్యూస్‌ తీసుకోవచ్చు. ఆపై దానికి ఒకవైపు ఉన్న రంధ్రంలో నుంచి రసాన్ని గ్లాస్‌లోనైనా పోసుకోవచ్చు.. లేదంటే అలాగే తాగేయచ్చు.

హ్యాండ్‌ ప్రెస్‌ జ్యూసర్

ఏ పండు నుంచి రసం తీయాలన్నా బ్లెండర్‌లో వేయడం మనకు అలవాటే! అయితే ఈ క్రమంలో మిక్సీ, జ్యూసర్ జార్‌, కరెంట్‌.. ఇవన్నీ అవసరమవుతాయి. మరి, వాటితో పనిలేకుండా ఒక్క ప్రెస్‌తో జ్యూస్‌ తయారుకావాలంటే ‘హ్యాండ్‌ ప్రెస్‌ జ్యూసర్‌’ మన చేతిలో ఉండాల్సిందే!

ఫొటోలో చూపించినట్లుగా ఇది అచ్చం లెమన్‌ స్క్వీజర్‌లా ఉంటుంది. అయితే పరిమాణంలో కాస్త పెద్దగా ఉండే దీనిలో బత్తాయి, కమలా ఫలం, యాపిల్‌, కివీ.. వంటి కాస్త పెద్దగా ఉండే పండ్ల దగ్గర్నుంచి ద్రాక్ష, దానిమ్మ గింజల దాకా ఏ పండు నుంచైనా అలవోకగా జ్యూస్‌ తీయచ్చు.

ఇందుకోసం ఫొటోలో చూపించినట్లుగా ఈ జ్యూసర్‌ మధ్య భాగంలో ఆయా పండ్ల ముక్కల్ని ఉంచి ఒక్కసారి నొక్కితే సరి! అయితే ఈ క్రమంలో మీకు ఆయా పండ్లలోని పిప్పి ఇక్కడే ఫిల్టర్‌ కావాలంటే పండ్లను ప్రెసర్‌లో పెట్టడానికి ముందు ఫిల్టర్‌ కవర్‌లో ఉంచితే సరిపోతుంది. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ చిటికెలో రసం తీసుకొని తాగేయచ్చు.

రీఛార్జబుల్‌ ఫ్రూట్‌ జ్యూసర్‌

జిమ్‌కెళ్లే వారు వర్కవుట్‌ పూర్తయిన తర్వాత తక్షణ శక్తి కోసం ఏదో ఒక పండ్ల రసం తాగడం సహజమే! అయితే ఈ క్రమంలో అప్పటికప్పుడు తాజాగా జ్యూస్‌ తయారుచేసుకోవాలనుకుంటే ఈ ‘రీఛార్జబుల్‌ ఫ్రూట్‌ జ్యూసర్‌’ చక్కటి ఎంపిక.

చూడ్డానికి ఒక చిన్న బాటిల్‌లో ఉండే దీనికి అడుగున బ్లేడ్స్‌ అమరి ఉంటాయి.. దీన్ని ముందే రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో పండ్ల ముక్కలు నింపి.. ముందు వైపు ఉన్న బటన్‌ని నొక్కితే చాలు.. క్షణాల్లో రసం తయారవుతుంది. ఇలా ఎంతో సులభంగా జ్యూస్‌ తయారుచేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్