దోశల్లోకి దానిమ్మ పచ్చడి..!

వేసవిలో నిల్వ పచ్చళ్లు పెట్టుకోవడం అందరూ చేసేదే. నాకు కొన్ని రోటిపచ్చళ్లూ తెలుసు. అవి మాత్రమే కాకుండా.. ఉప్పూ, కారం తక్కువగా ఉండేలా.. పిల్లలూ తినేలా అప్పటికప్పుడు సులువుగా చేసుకునే పచ్చళ్లు ఏవైనా చెబుతారా?

Updated : 17 Nov 2022 14:10 IST

దోశల్లోకి దానిమ్మ పచ్చడి..!

వేసవిలో నిల్వ పచ్చళ్లు పెట్టుకోవడం అందరూ చేసేదే. నాకు కొన్ని రోటిపచ్చళ్లూ తెలుసు. అవి మాత్రమే కాకుండా.. ఉప్పూ, కారం తక్కువగా ఉండేలా.. పిల్లలూ తినేలా అప్పటికప్పుడు సులువుగా చేసుకునే పచ్చళ్లు ఏవైనా చెబుతారా?

- శ్రీజ, కడప

పాలకూర పచ్చడి ప్రయత్నించండి. ఇందులో పోషకాలూ ఎక్కువే. ముందు పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లు మొత్తం ఒంపేయాలి. ఆ తర్వాత దాని మోతాదుని బట్టీ కాసిని పచ్చిమిర్చీ, ఉల్లిపాయలు తీసుకుని అన్నింటినీ నూనెలో వేయించుకోవాలి. వీటికి పచ్చికొబ్బరి తురుమూ, కాస్త చింతపండూ, ఉప్పు కలిపి మిక్సీ పట్టాలి. చివరగా ఇంగువ తాలింపు వేసుకుంటే చాలు. బరువు తగ్గాలనుకునేవారు తాలింపు పెట్టుకోనక్కర్లేదు. ఈ చట్నీ ఇడ్లీలూ, దోశలూ, పుల్కా, చపాతీల్లోకి బాగుంటుంది. క్యాప్సికంతోనూ పచ్చడి చేసుకోవచ్చు. ముందుగా.. రెండు చొప్పున క్యాప్సికం, ఉల్లిపాయల్ని తీసుకుని ముక్కల్లా కోసి బాగా వేయించుకుని పెట్టుకోవాలి. ఇవి చల్లారాక చెంచా చొప్పున సెనగపప్పూ, మినప్పప్పూ, నువ్వులూ, నాలుగైదు ఎండుమిర్చీ, అర చెంచా జీలకర్ర వేయించుకుని తీసుకోవాలి. ఈ తాలింపూ, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ చేసుకోవాలి. అయితే ఇందులో చింతపండు లేదా నిమ్మరసం కలిపితే బాగుంటుంది. ఈ కాలంలో దానిమ్మ పండ్లు ఎక్కువగా దొరుకుతాయి. వీటితోనూ రుచికరమైన, ఆరోగ్యాన్నిచ్చే పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ముందుగా దానిమ్మ రసం తయారుచేసుకోవాలి. రెండుమూడు పచ్చిమిర్చి తీసుకుని విత్తనాలు తీసేసి చాలా సన్నగా తరగాలి. దానిమ్మ రసంలో ఈ పచ్చిమిర్చి తురుమూ, రెండు చెంచాల చింతపండు గుజ్జూ, చెంచా చక్కెరపొడీ, కొన్ని గులాబీ రేకలు వేసి దగ్గరపడేవరకూ ఉడికించుకోవాలి. దీనికీ తాలింపు అవసరం లేదు. ఇది చపాతీ, దోశల్లోకి బాగుంటుంది.

email: vasundhara@eenadu.net

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్