సౌదీలో ‘సంక్రాంతి’ హేళ!

‘గొబ్బియళ్లో గొబ్బియళ్లో కొండానయ్యకు గొబ్బిళ్లు..’ అంటూ ఈ సంక్రాంతికి తెలుగు లోగిళ్లన్నీ మెరిసి మురిసిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు.. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు కుటుంబాలూ ఈ అతిపెద్ద పండగను వేడుకగా సెలబ్రేట్‌ చేసుకున్నాయి.

Updated : 30 Jan 2024 15:05 IST

‘గొబ్బియళ్లో గొబ్బియళ్లో కొండానయ్యకు గొబ్బిళ్లు..’ అంటూ ఈ సంక్రాంతికి తెలుగు లోగిళ్లన్నీ మెరిసి మురిసిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు.. విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు కుటుంబాలూ ఈ అతిపెద్ద పండగను వేడుకగా సెలబ్రేట్‌ చేసుకున్నాయి. ఇటీవలే సౌదీలో జరిగిన ‘సంక్రాంతి సంబరాలు’ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. అక్కడి అల్‌-జుబైల్‌ తీర ప్రాంతంలోని ‘ORKAID’ బీచ్‌ క్యాంప్‌లో నిర్వహించిన ఈ పండగ సంబరాల్లో సుమారు 35కి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. చిన్నా, పెద్దా అందరూ కలిసి ఈ వేడుకల్లో ఆడిపాడారు.

ఇందులో భాగంగా మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారు. వారంతా రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో పండగ కళను రెట్టింపు చేయడంతో పాటు.. పండగ పిండి వంటలతో అతిథులకు ప్రత్యేక విందు చేశారు. ఇక ఈ పండగ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కామెడీ స్కిట్స్‌, ఆటలు, డ్యాన్సులు, అంత్యాక్షరి పాటల పోటీల్లో.. మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత అందరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేశారు. మరి, సౌదీలో తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా జరిగిన ఈ సంక్రాంతి సంబరాలపై మీరూ ఓ లుక్కేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్