వేసవి తాపాన్ని తీర్చే చల్లని రెసిపీలు!

వేసవిలో ఎండల వల్ల డీహైడ్రేషన్, అధిక వేడిమి వంటి సమస్యలు తప్పవు. వీటన్నింటి నుంచీ విముక్తి కలిగించే అద్భుతమైన శక్తి సబ్జా గింజలకుంది..

Published : 04 Apr 2022 19:32 IST

వేసవిలో ఎండల వల్ల డీహైడ్రేషన్, అధిక వేడిమి వంటి సమస్యలు తప్పవు. వీటన్నింటి నుంచీ విముక్తి కలిగించే అద్భుతమైన శక్తి సబ్జా గింజలకుంది.. నల్లని ఈ చిన్న గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వేడి పరారైపోవాల్సిందే..! అందుకే వాటితో చేసే ఈ రెసిపీలను ప్రయత్నించి చూడండి.

చియా స్ట్రాబెర్రీ కోకొనట్ మిల్క్ పుడ్డింగ్

కావాల్సినవి: కొబ్బరి పాలు - అరలీటర్; స్ట్రాబెర్రీలు - రెండు కప్పులు; మేపుల్ సిరప్ - పావు కప్పు (కావాలంటే దీని బదులు మీకు నచ్చిన స్వీట్‌నర్ వాడుకోవచ్చు); సబ్జా గింజలు - అర కప్పు;

తయారీ: ముందుగా కొబ్బరి పాలలో కప్పు స్ట్రాబెర్రీలు వేసి, మేపుల్ సిరప్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో సబ్జా గింజలు వేసి అవి కాస్త ఉబ్బుతుండగా ఫ్రిజ్‌లో పెట్టి రెండు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కప్పు స్ట్రాబెర్రీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కో గ్లాసులో కొన్ని కొన్ని వేసుకొని దానిపై ఈ పుడ్డింగ్ వేసి సర్వ్ చేసుకోవాలి.

చియా ఫ్రెస్కా..

కావాల్సినవి: సబ్జా గింజలు - రెండు టేబుల్ స్పూన్లు; నీళ్లు - రెండు కప్పులు; నిమ్మకాయ - ఒకటి; తేనె - టేబుల్ స్పూన్;

తయారీ: నిమ్మరసం, తేనె, నీళ్లు కలిపి అందులో సబ్జా గింజలు వేసి కాసేపు బయట ఉంచాలి. సబ్జా గింజలు కాస్త ఉబ్బినట్లు అవ్వగానే రెండుమూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి, ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి.

చియా చెర్రీ పాప్సికల్స్

కావాల్సినవి: కొబ్బరి పాలు - అర లీటరు; చెర్రీలు - రెండు కప్పులు; వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - అర టీస్పూన్; ఖర్జూరాలు - నాలుగు; సబ్జా గింజలు- రెండు టేబుల్ స్పూన్లు

తయారీ: సబ్జా గింజలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో సబ్జా గింజలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీం మౌల్డ్స్‌లో పోసి పుల్లలు గుచ్చి నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే సరి.. ఐస్‌క్రీం మౌల్డ్స్ లేకపోతే గ్లాసుల్లో పోసి దానికి ఐస్‌క్రీం పుల్ల గుచ్చినా సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్